Trending Couple : ట్రెండ్డింగ్ జంట హనీమూన్ మరింత ట్రెండ్‌

NQ Staff - September 21, 2022 / 10:37 AM IST

159817Trending Couple : ట్రెండ్డింగ్ జంట హనీమూన్ మరింత ట్రెండ్‌

Trending Couple : తమిళ నిర్మాత రవీందర్ ఇటీవల విజయ మహాలక్ష్మి ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Trending Couple Honeymoon Trend

Trending Couple Honeymoon Trend

ఈ సమయంలోనే వీజే మహాలక్ష్మి కేవలం ఆస్తి కోసమే రవీందర్ ని పెళ్లి చేసుకుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు, కానీ మహాలక్ష్మి గురించి రవీందర్ మాట్లాడుతూ మనస్ఫూర్తిగా తను నన్ను ప్రేమించిందని ఇద్దరం ముందు జీవితంలో చాలా సంతోషంగా ఉంటామని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకున్నామంటూ చేసిన వ్యాఖ్యలు మరింతగా చర్చనీయాంశం అయ్యాయి.

మొత్తానికి ఈ జంట సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ వైరల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు ఈ జంట వచ్చింది. అందుకు కారణం వీరిద్దరూ హనీమూన్ కి వెళ్లడం. హనీమూన్ ఫొటోస్ షేర్ చేస్తున్న వీరిద్దరూ మరింతగా ట్రెండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మరియు వీరి యొక్క హనీమూన్ గురించి ఈ స్థాయిలో చర్చ జరగడం ఆశ్చర్యంగా ఉంది.

సాధారణంగా రెండో పెళ్లి నార్మల్ గా చేసుకుంటారు, కానీ వీరిద్దరూ వైభవంగా చేసుకున్నారు. అంతేకాకుండా హనీమూన్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో సామాన్య జనాలు వీరిని చూసి ముక్కున వేలు వేసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఈ సెలబ్రెటీ కపుల్ అందరికీ ఆదర్శంగా నిలవాలి అంటూ కోరుకుంటున్నారు.