Tollywood Trending : మా అమ్మకు పెళ్లి

Tollywood Trending : టాలీవుడ్ క్యారెక్టర్ నటి సురేఖ వాణి కెరీర్ పరంగా లక్కీ అయుండొచ్చు. కానీ.. వైవాహిక జీవితం విషయంలో మాత్రం ఆమెకు దేవుడు అదృష్ట రేఖను సరిగా గీయలేదనిపిస్తోంది. రెండేళ్ల కిందట భర్త సురేష్ తేజ అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో సురేఖ వాణి.. కూతురే ప్రపంచంగా బతుకుతోంది. సినిమా అవకాశాలు కూడా తగ్గటంతో లైఫ్ లో ఖాళీ సమయం ఎక్కువ దొరుకుతోంది. కానీ జీవిత భాగస్వామి లేకపోవటం వల్ల ఒంటరితనం ఫీలవుతోంది. ఎంత ప్రయత్నించినా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది.

వల్ల కావట్లే..

లోన్లీనెస్ ని తగ్గించుకోవటానికి సురేఖా వాణి సాధ్యమైనన్ని ఇతర వ్యాపకాలు పెట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ ఎవ్వర్ గ్రీన్ పాపులర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందుతోంది. జీవితంలో ఎదురవుతున్న కష్టాల్ని ముఖంలో, పైకి కనిపించకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటానికి ట్రై చేస్తోంది. అందంతోపాటు భవిష్యత్తు ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి ఆమెను వెంటాడుతోంది. ఇలాంటి విషయాలు బయటివాళ్లకు తెలియకుండా కిందో మీదో పడి మ్యానేజ్ చేయగలుగుతున్నా నిత్యం తనతో ఉండే కూతురు సుప్రీత ముందు మాత్రం అలా దాచుకోలేకపోతోంది.

రెండో ఆలోచన: Tollywood Trending

భర్త శాశ్వతంగా దూరం కావటం, మూవీ ఛాన్స్ లు కూడా తగ్గటంతో డబ్బుకు లోటు లేకపోయినా తల్లి మనసులోని కంటికి కనిపించని బాధను అర్థంచేసుకున్న సుప్రీత ఆమెకి ‘రెండో పెళ్లి చేసుకో’ అనే ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించిన టాలీవుడ్ సెలెబ్రిటీ మాదిరిగా మంచి నిర్ణయం తీసుకోవాలంటూ సర్దిచెబుతోందట. ‘‘నువ్వు మ్యారేజ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా’’ అంటూ చిన్న వయసైనా మెచ్యూర్డ్ గా సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.

Tollywood Trending : new trend in tollywood
Tollywood Trending : new trend in tollywood

కన్విన్స్..

కూతురి సూచనతో సురేఖ వాణి ఆలోచనలో పడ్డట్లు టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే పునర్వివాహం చేసుకోవటానికి ఇప్పుడిప్పుడే మానసింగా ప్రిపేర్ అవుతోందని చెబుతున్నారు. దీంతో త్వరలో ఆమె పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. సురేఖ వాణి గానీ ఆమె కూతురు గానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుప్రీత ప్రతిపాదన నవతరం ఆలోచనలకు అద్దంపడుతోందని సోషల్ అనలిస్టులు అంటున్నారు.

Advertisement