Tollywood: మ‌హేష్ బాబు టూ అల్లు అర్జున్ .. స్టార్ హీరోల క్ర‌ష్ ఎవ‌రిపైనో తెలుసా?

Tollywood: సినిమా స్టార్స్ అయిన పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అయిన వారికి క్రష్ ఉండ‌డం స‌హజం. మ‌న మాదిరిగానే వారికి కూడా ఎవ‌రో ఒక‌రి పైన క్ర‌ష్ స‌హ‌జంగా ఏర్ప‌డుతుంది. మ‌న స్టార్ హీరోల విష‌యానికి వ‌స్తే కొంద‌రు హీరోయిన్స్‌పై, మ‌రి కొంద‌రు టీచ‌ర్స్‌పై ఇంకొంద‌రు క్లాస్‌మేట్స్‌పై మ‌న‌సు పారేసుకున్నారు.

Tollywood

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఫ‌స్ట్ క్ర‌ష్ హాలీవుడ్ డైరెక్ట‌ర్ డేమి మూరెపై ఉండేద‌ట‌. ఆ త‌ర్వాత హీరోయిన న‌మ్ర‌త‌పై ఉండేద‌ట‌.కొన్ని రోజులు ఆమెతో స‌హ‌జీవ‌నం చేసిన మహేష్ బాబు చివ‌రికి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు గౌత‌మ్, సితార జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ త‌న ఫ్యామిలీకి చాలా ప్రయారిటీ ఇస్తార‌న్న సంగతి తెలిసిందే.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న చిన్న‌ప్పుడే ఐశ్వ‌ర్య‌రాయ్‌కు గుండెల్లో గుడి క‌ట్టేశాడంట‌. ఆమె త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ అని చాలా సార్లు చెప్పాడు. చిన్న‌ప్ప‌టి నుండి ఐశ్వ‌ర్య‌రాయ్ సినిమాలు చూస్తూ పెరిగిన అల్లు అర్జున్ ఇప్ప‌టికీ ఆమెను దైవంగా భావిస్తాడ‌ట‌. అయితే త‌న ఫ్యామిలీని అంత‌క‌న్నా ఎక్కువ‌గా ప్రేమిస్తుంటాడు అల్లు అర్జున్.

ఇక ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి స్నేహితుల‌న్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రి టేస్ట్‌లు కూడా ఒకేలా ఉన్నాయి. రామ్ చరణ్ చిన్నతనం నుంచి శ్రీదేవిపై అభిమానాన్ని పెంచుకోగా ఎన్టీఆర్ కూడా శ్రీదేవి సినిమా వస్తే ఆమెను తప్ప మరొక విషయాన్ని పట్టించుకునేవాడు కాదట.

బాహుబ‌లి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ గురించి ఓ సంద‌ర్భంలో చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. చెన్నైలోని డాన్ బొస్కో స్కూల్ లో చదివేటప్పుడు అక్కడ క్లాస్ టీచర్ ను చూసి ఫిదా అయ్యాడట. ఆమెనే తన క్రష్ అని ఇప్పటికి కూడా టీచర్ పై అదే ఫీలింగ్ ఉందని ఓపెన్ గానే చెప్పేశాడు. ప్ర‌స్తుతానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా ఉన్న ప్ర‌భాస్ ఎలాంటి అమ్మాయిని త‌న జీవితంలోకి ఆహ్వానిస్తాడో చూడాలి.