Tollywood : టాలీవుడ్‌లో జూన్ నుంచి షూటింగ్స్ మొదలు..?

Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో జూన్ నెల నుంచి షూటింగ్స్ మొదలవనున్నాయా..అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మార్చ్ తర్వాత నుంచి కరోనా సెకండ్ వేవ్ ఉధృతి విపరీతంగా ఎక్కువవడంతో ఇండస్ట్రీ డైలమాలో పడింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దిల్ రాజు, నివేథా థామస్ సహా పలువురు స్టార్స్ కరోనా బారిన పడటంతో తప్పని పరిస్థితుల్లో రిస్క్ చేయలేక సెట్స్ మీదున్న సినిమా షూటింగ్స్ అన్నీ అర్ధాంతరంగా నిలిపివేశారు.

tollywood shootings from June
tollywood shootings from June

పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కేవలం 10 రోజులు షూటింగ్ జరిగితే మొత్తం షూటింగ్ అయిపోతుంది. ఆచార్య కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంది. అది కూడా అయితే ఆచార్య కూడా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ కూడా చాలా కొద్ది రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా టాలీవుడ్‌లో మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చాలా వరకు షూటింగ్స్ జరుగుతూ ఆగిపోయినవే. అయితే జూన్ నుంచి ఈ సినిమాలనీ సెట్స్ మీదకి వచ్చేలా చిత్ర దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.

Tollywood : భారీ బడ్జెట్ సినిమాల వరకు రెడీ అయ్యాయి.

వైద్య నిపుణుల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు మరో వారం పదిరోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడనున్నట్టు తెలుస్తోంది. దాంతో మేకర్స్ షూటింగ్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక థియేటర్స్ ఓపెన్ అయితే రిలీజ్ కి చాలా సినిమాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో తెలీదు గానీ కొన్ని మీడియం సినిమాల దగ్గర్నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు రెడీ అయ్యాయి. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అధిగమించి జనాలు ఎంతవరకు థియేటర్స్‌కు వస్తాయన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది.