Tollywood: ఆ రైట‌ర్ వెన‌క ప‌డుతున్న స్టార్ హీరోలు.. కార‌ణం?

Tollywood: సాయి మాధవ్ బుర్రా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి నుంచి ఇప్పుడు అందరు హీరోలు కూడా ఈయనే కావాలంటున్నారు. తమ సినిమాలకు మాటలు రాయాలంటూ కోరుకుంటున్నారు. దర్శకులు కూడా సాయి మాధశ్ బుర్రా చుట్టూనే తిరుగుతున్నారు. ఎవరికి మాటలు రాయాలో.. ఎవరికి నో చెప్పాలో తెలియనంత బిజీగా ఉన్నాడు ఈయన. టాలీవుడ్ టాప్ రైటర్స్ లో ఒకడిగా మారిపోయాడు సాయి మాధవ్ బుర్రా.

ఒకప్పుడు ఈయన కేవలం ఆఫ్ బీట్ సినిమాలకు మాత్రమే మాటలు రాస్తాడనుకున్నారంతా. ఫీల్ గుడ్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమాలలో మాటలు రాసాడు బుర్రా. అందులో ఈయన రాసిన ప‌దునైన‌ డైలాగులు విన్న తర్వాత ఈయన పెన్ పవర్ ఏంటో అందరికీ అర్థమైంది.

అప్పటి వరకు స్టార్ హీరోల జోలికి వెళ్లకపోయినా కూడా మొదటి సారి గోపాలా గోపాలా సినిమాలో తన స్థాయి చూపించాడు సాయి మాధవ్. అందులో పవన్ ఇమేజ్‌కు సరిపోయే మాటలు రాసి ఔరా అనిపించాడు. అప్పట్నుంచి బుర్రా వెంట పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఓ వైపు సైరా, శాతకర్ణి లాంటి చారత్రాత్మక సినిమాలకు రాస్తూనే.. మరోవైపు క్రాక్, ఖైదీ నెం 150 లాంటి పక్కా కమర్షియల్ సినిమాలకు కూడా మాటలు రాస్తున్నాడు బుర్రా. ప్రస్తుతం పవన్, క్రిష్ హరిహర వీరమల్లుతో పాటు మరో అరడజన్ సినిమాలకు మాటలు రాస్తున్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే క్రాక్, శ్రీకారం సినిమాలకు ఈయనే మాటలు రాసాడు. ప్రస్తుతం సాయి మాధవ్ మాటలు రాస్తున్న సినిమాలేంటో చూద్దాం..

1. రాజమౌళి ట్రిపుల్ ఆర్
2. రామ్ చరణ్, శంకర్ సినిమా
3. సమంత అక్కినేని శాకుంతలం
4. ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా
5. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు