Pooja Hegde : కాలికి గాయం : పూజా హెగ్దే ఎలా కోలుకుందో తెలుసా.?
NQ Staff - November 26, 2022 / 10:22 PM IST

Pooja Hegde : పూజా హెగ్దే అంటే, తెరపై కనిపించే అందాల భామ మాత్రమే కాదు. చాలా కాన్ఫిడెంట్ గర్ల్.! అంతేనా, ఫిట్నెస్ విషయంలో ఆమెని రాక్షసిగా అభివర్ణించొచ్చు. అలాంటి పూజా హెగ్దేకి గాయమైంది. అది కూడా ఆమె కాలు కింద పెట్టలేనంత గాయం.
కొన్ని వారాల పాటు కాదు, ఐదారు నెలల పైనే సమయం పడుతుంది రికవర్ అవడానికంటూ వైద్యులు సూచించారట. దాంతో, పూజా హెగ్దే తొలుత ఒకింత కంగారు పడింది. కానీ, ధైర్యం తెచ్చుకుంది.
వైద్యుల సూచనలు పాటిస్తూనే…
వైద్యుల సూచనలు పాటిస్తూనే, పూజా హెగ్దే ఫిజియో థెరపీతోపాటు, తనకు తెలిసిన చిట్కాలూ పాటించిందట. వైద్యుల సలహాతో నెమ్మదిగా అడుగులు వేస్తూ, జిమ్ వరకూ వెళ్ళింది. ఆ తర్వాత జిమ్లో కాలి మీద ఒత్తిడి పడకుండా వర్కవుట్లు చేస్తూ, శరీరాన్ని ధృఢంగా మార్చుకుంది ఈ బుట్టబొమ్మ.
కాలి గాయం తర్వాత పూజా హెగ్దే కోలుకోవడానికి సంబంధించి.. ఆమె వర్కవుట్ చేస్తున్న విషయాలు సహా.. ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్గా మారింది.
తెలుగులో మహేష్ సరసన ఆమె ఓ సినిమా చేస్తోంది. పవన్ సరసన హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది కూడా.!