K Vishwanath: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ ఇక లేరు..

NQ Staff - February 3, 2023 / 12:25 AM IST

K Vishwanath: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ ఇక లేరు..

K Vishwanath: టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కె.విశ్వనాథ్ పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

విశ్వనాథ్ చెన్నైలోని ఒక స్టూడియోలో టెక్నీషియన్‌గా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తరువాత శ్రీ. ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. దర్శకుడు రాంనాథ్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పనిచేశాడు. అలాగే కె.బాలచందర్, బాపుల వద్ద సహాయకుడిగా పనిచేయాలని ఆకాంక్షించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ తొలిసారి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఆయన పూర్తి నైపుణ్యం సిరి సిరి మువ్వ అనే సినిమా ద్వారా వికసించింది. శంకరాభరణం సినిమా ఆయన ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించేలా చేసింది. స్వాతి ముత్యం 1986లో ఆస్కార్‌ పురస్కారానికి భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా గుర్తింపు పొందింది. నటుడిగానూ ఆయన సినిమాల్లో రాణించారు. తండ్రి, తాత పాత్రల్లో విశ్వనాథ్ చెరగని ముద్ర వేశారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us