టాలీవుడ్ లో బారి బడ్జెట్ తో వచ్చి లాస్ అయినా ఆ పది సినిమాలు ఏవో తెలుసా…!

Advertisement

మన టాలీవుడ్ లో ఎలా ఉంటుందంటే ఒక హీరో సినిమా రీలీజ్ అయ్యి హిట్ కొట్టి ఎంత పెద్ద పేరు తెస్తుందో… అలాగే ప్లాప్ అయినట్లయితే అంత కన్నా ఎక్కువగా చెడ్డ పేరు వస్తుంది. అది ఎంత పెద్ద హీరో అయినా … లేక ఎంత చిన్న హీరో అయినా… లేక ఇదివరకు హిట్ కొట్టిన హీరో- డైరెక్టర్ కాంబినేషన్ అయ్యిన.. లేకపోతే అస్సలు ఇప్పటి వరకు ట్రై చేయని కాంబినేషన్ అయ్యిన ప్లాప్ ఎక్కడి నుండి వస్తుందో తెలియని పరిస్థితి. అయితే మన టాలీవుడ్ లో స్టోరీ బాగలేకుండా ప్లాప్ అయ్యిన సినిమాలు ఉన్నాయి. అలాగే స్టోరీ బాగుండి సినిమాను సరిగా తెరకెక్కించపోవడం వల్ల ప్లాప్ అయ్యిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ప్లాప్ అయ్యిన సినిమాల వల్ల ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ల నుండి డిస్టిబ్యూటర్ల వరకు లాస్ అయ్యిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే మన టాలీవుడ్ లో ఆ విధంగా బారి బడ్జెట్ తో వచ్చి ప్రేక్షకులను ఆదరించని టాప్ 10 సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


దాంట్లో మొదటి సినిమా అజ్ఞాతవాసి … త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. ఎందుకంటె వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు జల్సా మరియు అత్తారింటికి దారేది. ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచాయి. తరువాత మల్లి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. మూడో సారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా… ఇక అభిమానులకు పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా అందరు అనుకున్నట్టు పెద్దగా ఆదరించలేదు.
రెండొవ సినిమా “బ్రహ్మోత్సవం”. శ్రీకాంత్ అడ్డాల అంటే ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. తాను తీసే ప్రతి సినిమా ఫ్యామిలీ తో కలిసి హ్యాపీ గా చూడొచ్చు. మరి సడన్ గా తనకు ఏమైందో ఏమో.. మహేష్ బాబు తో కలిసి తీసిన బ్రహ్మోత్సవం సినిమా అభిమానులను పెద్దగా ఆదరించకపోగా విమర్శల పాలైంది

మూడో సినిమా “జంజీర్ ” బాలీవుడ్ ఓల్డ్ సినిమా అయినా జంజీర్ ను రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో గా రామ్ చరణ్ తేజ్ నటించారు. ఈ సినిమా బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ బాలీవుడ్ లో ఆడలేదు మరియు మన టాలీవుడ్ లో కూడా పెద్దగా ఆదరణ పొందలేదు. ఈ సినిమా రాంచరణ్ అనవసరం గా తీసాడని అంటారు రామ్ చరణ్ అభిమానులు.
నాలుగో సినిమా ” ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా శక్తి . ఈ సినిమాను అశ్విని దూత్ చాలా గొప్పగా ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఈ సినిమా స్టోరీ మరియు సెకండ్ హాఫ్ లో అభిమానులను నిరాశపరిచింది.

ఐదో సినిమా ” యంగ్ రెబల్ స్టార్ నటించిన సినిమా రెబల్. ఈ సినిమా ఫైట్స్ కోసమే రెండు సంవత్సరాలు యాక్షన్ సినిమా లా చాలా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్లు. కానీ ఈ సినిమాలో కొన్ని ఓవర్ యాక్షన్లు మరియు అక్కెరకు రాని సెంటిమెంట్ లు సినిమాను నాశనం చేసాయి.
ఆరో సినిమా ” నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ఒక్క మొగాడు. ఫ్యామిలీ సినిమాలతో లవ్ స్టోరీ తీయడంలో మంచి పేరున్న డైరెక్టర్ వైవీఎస్ చౌదరి. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా ఆదరించలేదు. ఇక బాలయ్య బాబు , అనుష్క మరియు నిషా కొఠారి వీళ్ళ నటనకు మాత్రం దండం పెట్టాలి.

ఏడో సినిమా” supar స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా స్పైడర్. స్టోరీ పరంగా మంచి సినిమా కానీ ఈ సినిమాలో ఉన్న కొన్ని ఓవర్ యాక్షన్ సీన్లు చూసే వారికి ఇబ్బందిగా ఉన్నాయి.

ఎనిమిదో సినిమా “రాణి రుద్రమదేవి”. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా, అల్లు అర్జున్, రానా వంటి హీరోలు కూడా ఉండడం విశేషం. కానీ ఈ సినిమాలో పేద్ద పెద్ద సెట్లు వేసి మరి తీసినప్పటికీ పెద్దగా అభిమానులనూ ఆదరించలేదు.

తొమ్మిదో సినిమా “కొమురం పులి”. ఖుషి లాంటి అద్భుతమైన సినిమాతో పెద్ద హిట్ కొట్టి, కొమురం పులి సినిమా తో పెద్ద ప్లాప్ కొట్టారు డైరెక్టర్లు ఎస్ కె సూర్య మరియు పి కె మనోజ్. ఈ సినిమాలో హీరో గా పవర్ స్టార్ నటించిన కొన్ని సీన్లు ఓవర్ యాక్షన్ గా ఉన్నాయి.

పదో సినిమా “అఖిల్ “. అక్కినేని వారసుడు నటించిన మొట్ట మొదటి సినిమా అఖిల్. ఈ సినిమా కు ప్రొడ్యూసర్ గా హీరో నితిన్, డైరెక్టర్ గా వివి వినాయక్ మరియు ఈ సినిమా కథ ను రాసింది కోన వెంకట్. ఇంత మంచి టిక్నిషియన్ లతో వచ్చినా… సినిమా మాత్రం ఓవర్ ఎక్సగ్గరేటెడ్ గా అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here