Tollywood : అందరూ సంక్రాంతికే అంటే ఎలారా బాబు!
NQ Staff - January 30, 2023 / 10:11 PM IST

Tollywood : మొన్న సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
దాంతో చాలా మంది స్టార్ హీరోలు 2024 సంక్రాంతి పై కన్ను వేశారు. సంక్రాంతి సీజన్ కి సినిమాలు వస్తే మినిమం టాక్ సొంతం చేసుకున్నా కూడా భారీ కలెక్షన్స్ నమోదు అవుతాయని పలు సందర్భాల్లో నిరూపితమైంది.
కనుక 2024 సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇంకా పలువురు హీరోలు కూడా తమ సినిమాలను తీసుకోచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
సంక్రాంతికి ఇంకా 11 నెలల సమయం ఉంది. కనుక అప్పటి వరకు ఏ సినిమాలు ఎంత వరకు పూర్తయితాయి.. ఏ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే అందరూ కూడా సంక్రాంతి బరిలో తాము ఉండబోతున్నాం అన్నట్లుగా మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. చివరకు ఎవరు ఉంటారనేది వేచి చూడాలి.