Tollywood: పెళ్లి పీట‌లెక్క‌నున్న మ‌రో హీరో.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

Tollywood: ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌యంలో ఖాళీగా ఉన్న‌సినీ సెల‌బ్రిటీలు క‌రోనా స‌మయంలో పోటీ ప‌డి మ‌రి పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రానా,నిఖిల్, దిల్ రాజు,నితిన్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ ఇలా చాలా మంది సెల‌బ్స్ క‌రోనా కాలంలోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ఇప్పుడు యువ హీరో రాజ్ త‌రుణ్ త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రాజ్ తరుణ్ ఆ తరువాత సినీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F వంటి సినిమాల‌తో మార్కెట్ బాగా పెంచుకున్న రాజ్ త‌రుణ్ అభిమానుల‌ని కూడా బాగానే సంపాదించుకున్నాడు.

Tollywood

కెరీర్ మొద‌ట్లో మంచి ఫాంలో ఉన్న రాజ్ త‌రుణ్ త‌ర్వాత దానిని కంటిన్యూ చేయ‌లేక‌పోతున్నాడు. కొంత కాలంగా ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా రాజ్ త‌రుణ్‌కి ద‌క్క‌డం లేదు. ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కడం లేదు. దానికితోడు కొన్ని కమిట్మెంట్స్ కారణంగా కూడా రాజ్ తరుణ్ త‌న‌కు నచ్చని సినిమాలు చేయాల్సి వచ్చింది. ప్ర‌స్తుతం ‘స్టాండప్‌ రాహుల్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్‌ కుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్‌ ఆగస్తి సంగీతం అందిస్తున్నారు.

Tollywood

రాజ్ త‌రుణ్‌కి ఆ మ‌ధ్య ఓ నిర్మాత రెమ్యున‌రేష‌న్‌కు బ‌దులు కొత్త బంగ్లా కొనిచ్చాడ‌ట‌. ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయిన‌ట్టు స‌మాచారం. కొత్త ఇల్లు ఎలాగు వ‌చ్చింది కాబ‌ట్టి త్వ‌ర‌లో పెళ్లికి కూడా యువ హీరో సిద్ద‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవల ఈ హీరో తన ఇంట్లో వాళ్లని కూడా ఒప్పించినట్లు టాక్ వస్తోంది. ముందు నిశ్చితార్థం చేసుకొని అనంతరం ఈ ఏడాది చివరలో లేదా 2022 స్టార్టింగ్ లో గాని పెళ్లికి ముహూర్తం సెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమ్మాయి త‌న స్నేహితురాలు అని తెలుస్తుంది . ఇందులో నిజం ఎంత ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.