Tollywood : ‘లవకుశ’ నుంచి ‘బాహుబలి2’ వరకు.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన తెలుగు సినిమాలు..

Tollywood : తెలుగు చలన చిత్రాల చరిత్రలో.. గడచిన ఆరు దశాబ్దాల్లో.. కొన్ని వందల, వేల సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఎన్నెన్నో మూవీలు ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించాయి. అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిపోయాయి. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల విషయంలో కొత్త కొత్త చరిత్రలను సృష్టించాయి. వాటిలో ఓ పది సూపర్ డూపర్ హిట్ రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్స్ ను పరిశీలిస్తే..

  1. లవకుశ: 1963 మార్చి 29న రిలీజైంది. ఎన్టీఆర్ రాముడిగా, అంజలీదేవి సీతగా నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన తొలి కలర్ మూవీ. కేవలం 26 కేంద్రాల్లో విడుదలై కమర్షియల్ గా నెవ్వర్ బిఫోర్ అనేంత రేంజ్ లో విజయం సాధించింది. టికెట్ల రేట్లు పావలా, రూపాయి ఉన్న ఆ రోజుల్లోనే కోటి రూపాయలు కలెక్ట్ చేసింది.
  2. ముద్దుల మామయ్య: 1989 ఏప్రిల్ 7న విడుదలైంది. బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం తొలిసారి ఏకంగా రూ.5 కోట్లు సంపాదించింది. సిస్టర్ సెంటిమెంట్ కి పట్టం కట్టింది. ఇందులోని ‘మామయ్య అన్న పిలుపు.. మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు’ అనే పాట నేటికీ శ్రోతల నోళ్లల్లో నానుతోంది.
  3. పెదరాయుడు: అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టింది. 1995 జూన్ 15న రిలీజై మొదటిసారి రూ.10 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా గెస్ట్ రోల్ పోషించి ‘ది బెస్ట్’ అనిపించుకున్నారు. మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ.. ఫ్యాన్స్ మనసులో తమదైన ముద్ర వేశారు.
  4. సమరసింహారెడ్డి: రాయలసీమ నేపథ్యంలో రూపొందించిన ఈ ఫిల్మ్ 1999 జనవరి 13న విడుదలై ఫస్ట్ టైమ్ 15 కోట్లు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఫ్యాక్షన్ మూవీస్ కి సరికొత్త ట్రెండ్ గా నిలిచింది.
  5. నరసింహనాయుడు: మరోసారి బాలకృష్ణ, సిమ్రాన్ జంటగా 2011 జనవరి 11న రిలీజైన ఈ చిత్రం బాలయ్య అంతకు ముందు రూ.15 కోట్ల కలెక్షన్లతో నెలకొల్పిన రికార్డుని ఈసారి రూ.20 కోట్ల రాబడితో తిరగరాసింది. 72 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.
  6. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, భూమిక, అంకిత, నాజర్ కలిసి నటించిన ఈ మూవీ తారక్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. మొదటిసారిగా రూ.25 కోట్లు సంపాదించి రాజమౌళి సత్తాను టాలీవుడ్ కి మరోసారి చాటింది. 2003 జూలై 9న రిలీజై మ్యూజికల్ గా కూడా మస్తు హిట్టయింది.
  7. పోకిరి: 2006 ఏప్రిల్ 28న విడుదలై రూ.30 కోట్ల కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్ ని ఊహించని మలుపు తిప్పింది. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలనిపించింది. పూరీ జగన్నాథ్ మళ్లీ తన స్టామినాని నిరూపించుకున్నారు. ఇందులో హీరోయిన్ ఇలియానా.
  8. మగధీర: 2009 జూలై 30న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసింది. అప్పటివరకూ తెలుగు సినిమాలు 5.. 10.. 15.. 20.. 25.. 30.. ఇలా ఐదైదు కోట్ల రూపాయల చొప్పున అత్యధిక వసూళ్లు రాబట్టగా ఆ స్థాయిని చెర్రీ, కాజల్ జంట ఒక్కసారిగా రెట్టింపు కన్నా ఎక్కువ(రూ.70 కోట్ల)కి చేర్చింది.
  9. బాహుబలి (ద బిగినింగ్): ప్రభాస్, అనుష్క, తమన్నా కలయికలో రాజమౌళి హవాను కొనసాగిస్తూ తెలుగు సినిమా రేంజ్ ని ప్రపంచానికి చాటింది. 2015 జూలై 10న విడుదలై నభూతో-నభవిష్యతి అన్నట్లు నిలిచింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుని సొంతం చేసుకుంది. కనీవినీ ఎరగని రీతిలో రూ.300 కోట్లు వచ్చాయి.
  10. బాహుబలి-2(ది కన్ క్లూజన్): తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు, తర్వాత అనే విధంగా అభిమానులను అలరించింది. తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. 2017 ఏప్రిల్ 28న రిలీజై నెవ్వర్ ఆఫ్టర్ అనేంతగా రూ.800 కోట్లు రాబట్టింది. ఒక్క రోజులోనే రూ.200 కోట్ల కలెక్షన్లలో కొత్త రికార్డు నెలకొల్పింది.
Tollywood-from-lavakusha-to-bahubali2-tollywood-record-breaking-collections
Tollywood-from-lavakusha-to-bahubali2-tollywood-record-breaking-collections
Advertisement