Tollywood: టాలీవుడ్‌లో మొద‌లైన స‌రికొత్త ట్రెండ్.. యూఎస్ ప్రీమియ‌ర్ షోస్ ర‌ద్దు చేస్తున్న మేక‌ర్స్

Tollywood: క‌రోనా కాస్త శాంతించ‌డంతో ప్ర‌పంచం వేగంగా ముందుకు సాగుతుంది. సినిమా రంగం విష‌యానికి వ‌స్తే చిత్రీక‌ర‌ణ‌తో పాటు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి సినిమాలు థియేట‌ర్స్‌కి క్యూ క‌డుతున్నాయి. అయితే మ‌న సినిమాలు ఏ ఇక్క‌డ రిలీజ్ కాక ముందు యూఎస్‌లోని థియేట‌ర్స్ లో ప్రీమియ‌ర్ షోగా ప్ర‌ద‌ర్శించే వారు. దీంతో అక్క‌డ సినిమా చూసిన వారు ముందుగానే సోష‌ల్ మీడియా ద్వారా రివ్యూలు ఇచ్చేవారు.

Tollywood Film Makers Restricted US Premier Shows
Tollywood Film Makers Restricted US Premier Shows

ఈ కార‌ణం వ‌ల‌న మ‌న ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్‌కి గండి ప‌డుతుంది. సినిమా హిట్ అయితే ప‌ర్లేదు కాని, మూవీ కాస్త అటు ఇటు ఉంటే యూఎస్ ప్రీమియ‌ర్ రివ్యూ ద్వారా ఇక్క‌డి జ‌నాలు థియేట‌ర్స్‌కి వెళ్ల‌డ‌మే మానేస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో స‌రికొత్త ట్రెండ్‌కి నాంది ప‌లికింది సీటీమార్ చిత్రం. ఇటీవ‌ల విడుద‌లై పెద్ద హిట్ అయిన ఈ చిత్రం యూఎస్‌లో ప్రీమియ‌ర్ షో జ‌రుపుకోలేదు.

అలానే తాజాగా విడుద‌లైన కొండ పొలం చిత్రానికి కూడా యూఎస్ ప్రీమియ‌ర్ షో ర‌ద్దు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇలా చేయ‌డం ద్వారా మ‌న ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్‌కి గండిప‌డ‌డం త‌గ్గుతుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారట‌. మ‌రి ఈ ట్రెండ్ రానున్న రోజుల‌లో ఏయే నిర్మాత‌లు పాటిస్తారో చూడాలి. అయితే యూఎస్ ప్రీమియ‌ర్ క్యాన్సిల్ చేసుకున్న సీటీమార్, కొండ పొలం చిత్రాలు రెండు మంచి విజ‌యం సాధించ‌డం విశేషం.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం చిత్రం రిలీజ్ ముందే హైప్ క్రియేట్ చేసింది. వైష్ణవ్ – రకుల్ ప్రీత్ నడుమ రొమాన్స్.. ఇందులో వైష్ణవ్ పాత్ర చిత్రణ.. పులి కాన్సెప్ట్ ప్రతిదీ కొత్తగా అనిపించాయి. అడవి నేపథ్యం పచ్చదనం నేపథ్యంలో ప్రయోగాత్మక థ్రిల్లర్ మూవీ ఇదని అర్థమైంది.