Tollywood fight : 2022 సంక్రాంతికి తాను ఒక్కడినే బరిలో దిగుతున్నా అనుకున్న మహేశ్ కి షాక్ ఇచ్చిన ముగ్గురు టాప్ హీరోలు

Tollywood fight : తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బాటలో తానూ ‘సంక్రాంతి హీరో’ అనిపించుకోవాలని ప్లాన్లు వేస్తున్న ప్రిన్స్ మహేశ్ బాబుకు అనూహ్యంగా ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోల నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఆ త్రిమూర్తులు మరెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2022 సంక్రాంతి సీజన్ లో మహేశ్ బాబు మూవీతోపాటు వీళ్ల చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

ఏంటవి?..

‘గీత గోవిందంద’ డైరెక్టర్ పరశురామ్, ఘట్టమనేని హీరో మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ఒక్కటి మాత్రమే కాకుండా తారక్, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫిల్మ్, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘సలార్’ సైతం 2022 జనవరి నెలలో అతి పెద్ద పండుగ ‘పొంగల్’ సీజన్ లోనే థియేటర్లలో సందడి చేయనుండటం గమనార్హం.

ఎవరికివారే: Tollywood fight

దాదాపు ఏడాది కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల బొమ్మలు విడుదల కాలేదు. కరోనా కారణంగా ఒక్క టాలీవుడ్ లోనే కాదు. దేశమంతటా ఇండస్ట్రీకి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇంతకాలం షూటింగులు, రిలీజ్ లు ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ ఇప్పుడు శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి. ఆల్రెడీ పూర్తికావొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ సినిమాలు దసరాకి వస్తున్నాయి. ఫలితంగా మిగతావి క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్ మూడ్ ని సొంతం చేసుకోవటానికి ఎదురుచూస్తున్నాయి.

Tollywood fight : prince-mahesh-babu-schock-with-three-top-heros
Tollywood fight : prince-mahesh-babu-schock-with-three-top-heros

కిం కర్తవ్యం?..

పోయినేడాది (2020) ముగ్గుల పండక్కి ముచ్చటగా ‘సరిలేరు నీకెవ్వరు’తో వచ్చిన మహేశ్ బాబు..  ఫ్యాన్స్ ని మెప్పించాడు. కానీ, 2021లో మాత్రం రాలేకపోయాడు. ఈ లోటును భర్తీ చేయటానికి 2022 సంక్రాంతికి ప్రిపేర్ అవుతుంటే మరో ముగ్గురు అదే టైమ్ కి తమ చిత్రాల విడుదలకు డేట్లు ఫిక్స్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా.. జనాన్ని అలరిస్తుందో, ఎన్నెన్ని వసూళ్లు రాబడతాయో చూడాలి. కాకపోతే ఏకంగా నలుగురు బడా హీరోలూ పోటీపడటం వల్ల ప్రేక్షకులు సందిగ్ధంలో పడటం మాత్రం ఖాయం. పాజిటివ్ టాక్ వచ్చే వరకు వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతారేమో.

Advertisement