TOLLYWOOD: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టాలీవుడ్ ద‌ర్శ‌కులు.. ఎవరెవ‌రు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారో తెలుసా?

Tollywood: తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌క ధీరులు ఉన్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో పాటు కుర్ర డైరెక్ట‌ర్స్ కూడా అద్భుత‌మైన సినిమాలు చేస్తున్నారు. మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఇంప్రెస్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమా క‌థ‌ల‌ను తీసుకొని మ‌నం రీమేక్ చేసుకుంటుంటే ఇప్పుడు మ‌న క‌థ‌ల‌పైనే బాలీవుడ్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంది. అంతేకాదు మార్కెట్ ప‌రంగా కూడా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఉన్నత స్థానంలో ఉంది. కంగన రనౌత్ లాంటి వాళ్లైతే బాలీవుడ్‌ ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ కాదు టాలీవుడ్ టాప్ అంటూ కామెంట్స్ కూడా చేసింది. మ‌రి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచుతున్న ద‌ర్శ‌కులు ఒక్కో సినిమా కోసం ఏళ్ల త‌ర‌బ‌డి కృషి చేస్తున్నారు. మ‌రి వీరు ఎంతెంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటారో ఓ సారి చూద్దాం .

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ అంటే ఫ‌స్ట్ గుర్తొచ్చేది రాజ‌మౌళి పేరు. బాహుబ‌లి సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ స్థాయిని ఎల్ల‌లు దాటించిన ఆయ‌న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో మ‌రో పెద్ద విజ‌యం సాధించాల‌నే క‌సితో ఉన్నాడు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్‌ని విడుద‌ల చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త చరిత్ర‌లు సృష్టించాల‌ని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారిన రాజమౌళి 30 కోట్ల రూపాయ‌ల‌తో పాటు లాభాల్లో వాటాని రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటాడ‌ట‌. ఇక అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ .. 20 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా అందుకుంటార‌ని తెలుస్తుంది. ఇక రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ కొట్టిన సుక్కూ ప్ర‌స్తుతం పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఆయ‌న రెమ్యున‌రేష‌న్ 20 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని,లాభాల్లో కొంత వాటా కూడా ఉంటుంద‌ని టాక్.

ఇక ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారిన కొర‌టాల శివ 20 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడ‌ని , బోయపాటి శ్రీను: 10 కోట్లు ,అనిల్ రావిపూడి: 8 కోట్లు , నాగ్ అశ్విన్: 8 కోట్లు , పూరీ జగన్నాథ్: 7 నుంచి 10 కోట్లు , పరశురామ్: 8 కోట్లు , సురేందర్ రెడ్డి: 7 కోట్లు , హ‌రీష్ శంకర్: 6 కోట్లు , మారుతి: 5 కోట్లు, వంశీ పైడిపల్లి: 6 కోట్లు, వివి వినాయక్: 7 కోట్లు, శేఖర్ కమ్ముల: 5 కోట్లు ,
క్రిష్: 4 కోట్లు గోపీచంద్ మలినేని: 2 కోట్లు తీసుకుంటార‌ని స‌మాచారం. ఇక ఒక‌ప్పుడు టాప్ డైరెక్ట‌ర్స్‌గా ఉన్న శ్రీను వైట్ల‌, కృష్ణ వంశీ వంటి ద‌ర్శ‌కుల‌కి ఇటీవ‌లి కాలంలో స‌రైన హిట్స్ రానందున వారి రెమ్యునరేష‌న్ త‌క్కువ‌గానే ఉంటుంద‌ని తెలుస్తుంది.