Varalaxmi Sarathkumar : వరలక్ష్మీ శరత్ కుమార్ జైలుకు వెళ్లిందన్న విషయం తెలుసా.. సంచలన మ్యాటర్ లీక్..!
NQ Staff - March 3, 2023 / 11:20 AM IST

Varalaxmi Sarathkumar : ఇప్పుడు లేడీ రెబల్ పాత్రలు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఒకప్పుడు రమ్యకృష్ణ, విజయశాంతి లాంటి వారు మాత్రమే ఇలాంటి పాత్రలకు ప్రాణం పోసేవారు. కానీ ఇప్పటి జనరేషన్ లో ఇలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ ఆమెకు మంచి పేరును తీసుకు వస్తున్నాయి.
ఆమె తమిళంలో హీరోయిన్ గా ట్రై చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో విలన్ పాత్రలకే జై కొట్టింది.ఇప్పుడు తెలుగు దర్శకులు ఆమెకు విలన్ పాత్రల్లో ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా ఆమె నటించిన మూవీ కొండ్రాల్ పావమ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ మాట్లాడారు.
పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్..
ఆయన మాట్లాడుతూ.. నా కూతురు సినిమాల్లోకి వస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఎందుకు అని వారించాను. కానీ ఆమె వినలేదు. ఆమె మొదటి నుంచి స్వయంకృషి ఉన్న వుమెన్. అంతే కాదు చాలా ధైర్యవంతురాలు కూడా. ఒకసారి నాకు ఓ ఫోన్ వచ్చింది. మీ కూతురు పోలీస్ స్టేషన్ లో ఉంది అంటూ పోలీసులు ఫోన్ చేశారు.
ఎందుకంటే నా కూతురు ఓ ఇద్దరు అబ్బాయిలను చితకబాదింది. అంతకు ముందు వారిద్దరూ తన కారును ఢీ కొట్టారు. అందుకే ఆమె అలా చేసింది. నా కూతురు ట్యాలెంట్ ఉన్న అమ్మాయి మాత్రమే కాదు చాలా ధైర్యవంతురాలు అయినందుకు గర్వంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు శరత్ కుమార్.