Tollywood: మ‌ళ్లీ తెర‌పైకి డ్ర‌గ్స్ కేసు.. పలువురు సెల‌బ్రిటీల‌కు స‌మ‌న్లు

Tollywood: సినీ ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే . నాలుగేళ్ల కిందట టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

అందులో భాగంగా..స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రానా దగ్గుపాటి, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్‏లకు ఈడీ సమన్లు పంపించింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ఆగస్ట్ 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితోపాటు.. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది

నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని తెలిపింది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ చేపట్టలేదు. సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేవలం కొందరిని విచారించారించి వదిలేసారు. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది.

సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుపాటి, సెప్టెంబర్ 9న రవితేజ, నవంబర్ 15న ముమైత్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్ ని 2017లో అరెస్ట్ చేసి విచారించగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను వెల్లడించాడు.

సెల‌బ్స్ కింది తేదీల‌లో విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ల్సి ఉంది..

ఎవరెవరిని ఎప్పుడు విచారించున్నారంటే..

పూరి జగన్నాధ్ – ఆగస్టు 31
ఛార్మి కౌర్‌ – సెప్టెంబర్ 2
రకుల్ ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6
రాణా దగ్గుబాటి – సెప్టెంబర్ 8
రవితేజ – సెప్టెంబర్ 9
శ్రీనివాస్ – ప్టెంబర్ 9
నవదీప్ – సెప్టెంబర్ 13
ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13
ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15
తనీష్ – సెప్టెంబర్ 17
నందు – సెప్టెంబర్ 20
తరుణ్‌ – సెప్టెంబర్‌ 22