Tollywood: బిగ్ అనౌన్స్‌మెంట్‌.. ఇద్ద‌రు హీరోల‌తో పాన్ ఇండియ సినిమా ప్లాన్

Tollywood: ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మ‌ల్టీ స్టార‌ర్ హ‌వా న‌డుస్తుంది. ఇద్ద‌రు హీరోలు ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన సినిమాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రిన్ని చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏషియన్ నారంగ్ ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. 27 ఆగస్టు బర్త్ డేని పురస్కరించుకుని తదుపరి అప్ డేట్ ని అందించేందుకు నారంగ్ బృందం సిద్ధమవుతోంది.

తాజాగా ఎగ్జయిటింగ్ ఎనౌన్స్ మెంట్ కి సిద్ధమవుతున్నాం అంటూ ప్రీలుక్ ని రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం ఉదయం 10.25 గం.లకు సినిమాని ప్రకటిస్తామని వెల్లడించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్.పి- ఏషియన్ సినిమాస్ – కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

తెలుగు,తమిళం,హిందీ, కన్నడ ,మలయాళం లో ఈ సినిమా అత్యంత భారీగా విడుదల కానుందని పోస్టర్ లో వెల్లడించారు.అయితే ఇందులో విజ‌య్ సేతుప‌తి, సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ద‌ర్శ‌కులు ఎవ‌రు, సినిమాలో నటించే న‌టీన‌టులు ఎవ‌రు అనే దానిపై రానున్న‌రోజుల‌లో క్లారిటీ రానుంది.

తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో సింహాసనం, రక్తసిక్తమై కనిపిస్తోంది. అంటే అక్కడ హత్య జరిగింది. కుర్చీ కోసం కొట్లాట అన్న అర్థం కనిపిస్తోంది. పోస్టర్ తోనే ఆద్యంతం క్యూరియాసిటీని పెంచారు. ఏదో చ‌రిత్ర నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందనున్న‌ట్టు తెలుస్తుంది. ఇంతకుముందే శేఖర్ కమ్ముల- ధనుష్ సినిమాని ఈ నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.