బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్న తెలుగమ్మాయి ..!

” అనుకోకుండా ” అనే షార్ట్ ఫిల్మ్‌ తో తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపించి పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి రీతు వర్మ. తన హావభావాలతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్‌లకు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. తన యాక్టింగ్‌ స్కిల్స్‌ కు ఇంప్రెస్‌ అయిన తమిళ ఇండస్ట్రీ క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోయిన్‌గా రీతూ వర్మకు మంచి అవకాశాలను ఇచ్చింది. ఒకరకంగా టాలీవుడ్‌ కంటే తమిళ ఇండస్ట్రీనే తన టాలెంట్‌ను మొదటగా గుర్తించిందని చెప్పుకోవాలి. ఆమె యాక్టింగ్ స్కిల్స్‌కి ఫిదా అయినా తమిళ స్టార్ హీరో విక్రమ్ తనతో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చాడు.

Nani teams up with Ritu Varma

దీంతో రీతు వర్మ క్రేజ్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి తమిళ, మలయాళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో వరసగా అవకాశాలను దక్కించుకుంటోంది. స్టార్ హీరోయిన్‌లు ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితమైతే .. అమ్మడు మాత్రం చేతినిండా సినిమాలతో క్రేజీ ఆఫర్లతో బిజీబిజీగా మారింది. ప్రస్తుతం రీతూ వర్మ నాచురల్ స్టార్ నానితో కలిసి టక్‌ జగదీష్‌ అన్న చిత్రం చేస్తోంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్‌ ప్రాజెక్టులోనూ నటిస్తోంది. కాగా యంగ్ హీరో నాగ శౌర్య సరసన కూడా ఒక సినిమా చేసే అవకాశం అందుకుంది.

Ritu Varma to star in Ravi Teja's upcoming film with Ramesh Varma? - Movies  News

ఒకవైపు యంగ్ హీరోల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు సీనియర్ హీరోల సినిమాలలోను అవకాశం అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రవితేజ, రమేష్ వర్మ చేయబోతున్న మూవీలో రీతూకు నటించే అవకాశం దక్కింది. అలాగే వెంకటేష్‌తో తరుణ్ భాస్కర్ చేయబోతున్న సినిమాలోనూ రీతూకు ఆఫర్ వచ్చిందని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎవరూ అంతగా పట్టించుకోకపోయిన తమిళ సినిమాలలో నటించి పాపులారిటీ రావడం తో వరసగా తెలుగు సినిమాలకి సైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ ని అందుకుంది మన తెలుగమ్మాయి.

Advertisement
Advertisement