Sunil: సునీల్ స‌తీమ‌ణిని ఎప్పుడైన చూశారా.. ఆమె ఏం చేస్తుందో తెలుసా?

Sunil: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, హీరోగా, విలన్ గా ఇలా విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్. సినిమా ఇండస్ట్రీలోకి విలన్ అవుదామని వచ్చిన సునీల్ ఊహించని విధంగా కమెడియన్ ఆ తరువాత విలన్ అయ్యారు . పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన సునీల్‌కు నువ్వే కావాలి చిత్రం క‌మెడీయ‌న్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది. చిన్న‌ప్ప‌టి నుండి చిరంజీవిని ఎంత‌గానో అభిమానించే సునీల్ డ్యాన్స‌ర్ కూడా కావాల‌ని అనుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు సునీల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సునీల్ రూమ్ మేట్స్ కాగా వారి ప‌రిచ‌యాల‌తో మెల్ల‌గా ఇండ‌స్ట్రీ మెట్లు తొక్కాడు.

Sunil

సునీల్ తండ్రి చిన్న‌ప్పుడే మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న త‌ల్లి సునీల్‌ని పెంచి పెద్ద చేశారు. చిన్న‌ప్ప‌టి నుండి క‌ష్ట‌ప‌డే త‌త్వం సునీల్‌కు ఉంది. ఆయ‌న హీరోగా కూడా రాణించారు. సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు, తడాఖా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. గత కొన్నేళ్ల నుంచి సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్లీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు సునీల్‌. తాజాగా తమిళ హాస్యనటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమారీమేక్‌లో న‌టిస్తున్నారు. రాజకీయ వ్యంగ్య హాస్య చిత్రంగా వచ్చి అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించ‌నుండ‌గా, ఇందులో సునీల్‌ని హీరోగా తీసుకోవాల‌ని వారు భావిస్తున్నారు.

Sunil

కెరీర్ విష‌యానికి వ‌స్తే సునీల్ గురించి అంద‌రికి తెలుసు. కాని ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం కొద్ది మందికే తెలుసు. ఆయ‌న భార్య ఎవ‌రు, ఎంత మంది పిల్లలు, సునీల్ స‌తీమ‌ణి ఏం చేస్తుంటారు వంటి విషయాలు చాలా మందికి తెలియ‌దు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు.సునీల్ అర్ధాంగి పేరు శృతి ఇందుకూరి. ఈమె హౌజ్ వైఫ్‌. బంధువుల ఫ్యామిలీ నుండే అమ్మాయిని తెచ్చుకున్నాడు. సునీల్ స‌తీమ‌ణి ఫోటోలు పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో కూడా క‌నిపించ‌వు. 45 ఏళ్ల సునీల్‌కు ఒక పాప‌, బాబు ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతుంటారు. సునీల్ జీవితం ఆయ‌న అభిమానుల‌కు ఆద‌ర్శం.

sunil