Ajay: రేప్ సీన్లు చూడటానికి బానే ఉంటాయి.. చేయాలంటే చాలా ఇబ్బంది

Ajay: సినీ ఇండస్ట్రీలో సినిమాలకు హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ పాత్రలకు కూడా అంతే వాల్యూ ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు వాళ్ళకు డిఫరెంట్ టాస్కులు ఎదురవుతుంటాయి. అందులోనూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఉండే విలన్స్ కాస్త మాస్ పవర్ ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతాయి. సౌత్ ఇండియా ఫిల్మ్స్ లో విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు అజయ్. ఒక్కడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర్నుండి సింహాద్రి, ఖుషీ, విక్రమార్కుడు, సై, అతడు లాంటి సూపర్ డూపర్ హిట్స్ లో నటించారు. దిక్కులు చూడకు రామయ్య సినిమాతో ఓ డిఫరెంట్ లుక్ తో పాటు ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్ చేశారు అజయ్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ సినిమా కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అజయ్ సెలెక్ట్ చేసుకునే పాత్రలన్నీ క్వాలిటీ వర్క్ ఉండేలా చూసుకుంటారు.

Ajay

అందులోనూ ఓ పాత్రను చేస్తున్నామంటే దానికి పూర్తిగా న్యాయం చేయగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారట. రాజమౌళి సినిమాల్లో నటించడం వల్లే తనకు అంత పేరు వచ్చిందని అజయ్ అన్నారు. నిజానికి అజయ్ ఎంతో క్రూరమైన సీన్స్ లో యాక్ట్ చేసినా, ఆయనకు చాలా సిగ్గు. చాలా కామ్ గా ఉండే వ్యక్తిత్వం. లైఫ్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకునే వరకు ఎన్నో ప్రాబ్లెమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే అజయ్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలను తట్టుకున్నారు అనుకున్నది సాధించారు.

Ajay

అలాగే ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. విలన్ పాత్రలంటేనే ఎంతో రిస్క్ తో ఉంటాయి. అలా దేశముదురు సినిమా షూటింగ్ టైమ్ లో ఫ్యాక్చర్ అయ్యింది. అలా ఎన్నో సార్లు సమస్యల్ని తట్టుకుని నిలబడ్డారు. రేప్ చేసే సీన్ ను చూడటానికి బాగానే ఉంటుంది కానీ చేయడానికి చాలా ఇబ్బంది పడాలంటున్నారు అజయ్. అదృష్టవశాత్తు తనకు ఎప్పుడు రేప్ సీన్లు రాలేదని వివరించారు. ఆ విషయంలో తాను చాలా హ్యాపీ అంటూ చెప్పారు అజయ్.