Tiku Weds Sheru Movie : 20 ఏళ్ల అమ్మాయితో 50 ఏళ్ల నటుడి ముద్దులు.. ఏంటీ అరాచకం..!

NQ Staff - June 21, 2023 / 11:00 AM IST

Tiku Weds Sheru Movie : 20 ఏళ్ల అమ్మాయితో 50 ఏళ్ల నటుడి ముద్దులు.. ఏంటీ అరాచకం..!

Tiku Weds Sheru Movie : సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. ఒకప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి. అందుకే అవసరం ఉన్నా లేకున్నా అలాంటి సీన్లను పెట్టేస్తున్నారు దర్శకులు. అయితే ఇందులో ఏజ్ గ్యాప్ లు కూడా అస్సలు చూడట్లేదు.

ఇప్పటికే చాలామంది హీరోలు తమ పిల్లల వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా ఇలాంటి పనే చేశాడు. ఆయన ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్ధిఖీ. బాలీవుడ్ లో ఆయనకు హీరోగా మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన తాజాగా నటిస్తున్న మూవీ టీకు వెడ్స్ షేరు.

ఈ మూవీలో అవ్ నీత్ కౌర్ హీరోయిన్ గా చేస్తోంది. నవాజుద్దీన్ వయసు 50 ఏళ్లు కాగా.. అవ్ నీత్ కౌర్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. వీరిద్దరి మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే తన కూతురు వయసున్న అమ్మాయితో నవాజుద్దీన్ ముద్దు సీన్లలో రెచ్చిపోయాడు. దాంతో తీవ్ర విమ్శలు వస్తున్నాయి.

Tiku Weds Sheru Movie Nawazuddin Siddiqui Romance With Avneet Kaur Lip Lock Scene

Tiku Weds Sheru Movie Nawazuddin Siddiqui Romance With Avneet Kaur Lip Lock Scene

అయితే మూవీ ప్రమోషన్స్ లో ఈ విమర్శలపై స్పందించాడు నవాజుద్దీన్. ఆయన మాట్లాడుతూ.. అసలు ముద్దు సీన్లు చేస్తే తప్పేంటి. అయినా రొమాన్స్ కు ఏజ్ తో సంబంధం లేదు. యూత్ ఇలాంటి సీన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇలాంటి అవకాశం వచ్చింది కాబ్టటే నటించాను. ఇది కేవలం సినిమా అంత వరకే చూడండి అంటూ చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us