రకుల్ ని ఇంత తక్కువంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడి చూడండి ..!

టాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ కి కెరీర్ లాంగ్ రన్ లో సాగదనే అంటుంటారు. ఒకరకంగా ఆ మాటా నిజమే. ఇలా వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసి సర్దుకునే హీరోయిన్ లిస్ట్ చాలా పెద్దదే. పది మందిలో ఒకరో ఇద్దరో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగి ఏళ్ళ పాటు చెక్కు చెదరని స్టార్ డం ని సాధిస్తారు. ఒక్క భాషలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే వరసగా ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటు హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ని కూడా అందుకుంటుంటారు.

Sushant Death Case: Rakul Preet Singh Reaches NCB Office - ODISHA BYTES

అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడి దాదాపు ఫేడవుట్ అయినప్పటికి లక్ కలిసి వచ్చి మళ్ళీ అవకాశాలు అందుకొని ఊహించని విధంగా కెరీర్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు. కాజల్.. అనుష్క.. త్రిష.. నయనతార .. ఇప్పటి వరకు సీనియర్ స్టార్ హీరోయిన్స్ గా తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ ని చేస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు ఇండస్ట్రీకొచ్చి దాదాపు 10 ఏళ్ళు పైనే అయింది. ఇప్పుడు ఇలాంటి సక్సస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తూ 7 ఏళ్ళు పూర్తి చేసింది.

కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఆ ఇబ్బందులను రకుల్ తట్టుకొని నిలబడింది. యంగ్ హీరోల తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళతోనూ నటించే అవకాశాలు అందుకుంది. చెప్పాలంటే రకుల్ కి టాలీవుడ్ హీరోలు బాగా సపోర్ట్ చేశారన్న మాట వాస్తవం. అల్లు అర్జున్, రాం చరణ్, సాయి ధరం తేజ్, నితిన్, నాగ చైతన్య లాంటి వాళ్ళు తమ సినిమాలలో రకుల్ ని ఎంపిక చేసుకోవడం గొప్ప విషయం. అంతేకాదు ఈ క్రమంలో రకుల్ స్టార్ హీరోయిన్ గానే కాదు భారీ సక్సస్ లను అందుకొని హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంది.

ఇక రకుల్ ఇలా 7 ఏళ్ళు ఇండస్ట్రీలో నిలబడుతుందని ఎవరూ ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో రకుల్ కి మంచి క్రేజ్ ఉంది. అక్కడ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లాంటి వాళ్ళ సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. కోలీవుడ్ లో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో ఇండియన్ 2 అన్న పాన్ ఇండియన్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక టాలీవుడ్ లో నితిన్, వైష్ణవ్ తేజ్ సినిమాలు చేస్తోంది. ఇక రకుల్ జోరు ని చూస్తుంటే మరో పదేళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతుందని అంటున్నారు.

Advertisement