ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ ఆ ఇద్దరిని హైదరాబాద్ రప్పించాడా ..?

కేజీఎఫ్ ఛాప్టర్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కమర్షియల్ సక్సస్ ని సాధించిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సౌత్ లో ఆ రేంజ్ సక్సస్ ని సాధించిన సినిమా అంటే కేజీఎఫ్ మాత్రమే. ఈ సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యష్.. చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్స్ అయిపోయారు. ఇక ఛాప్టర్ 1 సక్సస్ ని చూసిన మేకర్స్ ఈ సినిమాకి కొనసాగింపుగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తీయాలని డిసైడయ్యారు.

KGF Chapter 2 Full Movie facts | Yash | Sanjay Dutt | Srinidhi Shetty  |Prashanth Neel|Raveena Tandon - YouTube

అనుకున్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ కేజీఎఫ్ 2 రూపొందుతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీటయి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. కాగా తాజాగా ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిందని సమాచారం. ఇప్పటి వరకు కూడా కేజీఎఫ్ షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే జరగగా ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే కంప్లీట్ చేయనున్నారు.

లాక్ డౌన్ తర్వాత గత నెలలో షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ యశ్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులపై హైదరాబాద్ లో కొన్ని కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేశారు. కాగా తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యిందని లేటెస్ట్ అప్‌డేట్. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ – యష్ పాల్గొంటున్నారట. ఇప్పటికే సంజయ్ దత్ – యష్ హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ లో కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటుండగా ఇక్కడే కేజీఎఫ్ 2 షూటింగ్ ప్లాన్ చేసుకుంటే ప్రభాస్ తో చర్చలు జరపడానికి ఈజీ అవుతుందని భావించినట్టు చెప్పుకుంటున్నారు.

 

Advertisement