కాస్త ఖాళీ సమయం దొరికితే మహేష్ ఫ్యామిలీతో ట్రిప్‌లు వేయడం కామన్. కరోనా ఉదృతి కాస్త తగ్గాక దుబాయ్, ముంబైతో పాటు పలు ప్రాంతాలు చుట్టొచ్చిన మహేష్ ఫ్యామిలీ మళ్ళీ దుబాయ్ వెళ్ళారు. నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ ఫ్యామిలీ కనిపించే సరికి అంతా అవాక్కయ్యారు. సర్కారు వారి పాట షూటింగ్ మరి కొద్ది రోజులలో మొదలు అవుతుండగా, మళ్ళీ ఎటు వెళుతున్నాడు అని అందరు చర్చించుకున్నారు. అయితే నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దుబాయ్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అందరు ఆలోచిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
మహేష్ దుబాయ్ ట్రిప్ వెనుక ఉన్న మతలబు ఇదేనా?
జనవరి 22న నమత్ర శిరోద్కర్ బర్త్ డే కాగా, ఆమె బర్త్‌డేని దుబాయ్‌లో సెలబ్రేట్ చేయాలని భావించిన మహేష్ పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు.పుట్టిన రోజు వేడుకల తర్వాత నమ్రత, పిల్లలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారట. మహేష్ మాత్రం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ షెడ్యూల్లో పాటని చిత్రీకరించనున్నట్టు సమాచారం.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మంచి మెసేజ్‌తో కూడిన కమర్షియల్ మూవీ గా ‘సర్కారు వారి పాట’ రూపొందనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించడమే కాక ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిచనున్నట్టు తెలుస్తుంది.కాగా, గత ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని అలరించిన మహేష్ బాబు ఈ ఏడాది సర్కారు వారి పాట చిత్రంతో మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.