pawan kalyan : పవన్ కళ్యాణ్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద సినిమా చేస్తున్నా.. ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ పిలిచాడంటే త్రివిక్రమ్ వెంటనే ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ అంటే అంత..ప్రేమ, అభిమానం, గౌరవం. ఇక పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మీద అంతే అభిమానం చూపిస్తాడు. ఆయన దగ్గరకి వచ్చే కథలని విని ఫైనల్ చేసే సలహాలు కూడా త్రివిక్రమ్ .. పవన్ కళ్యాణ్ కి ఇస్తుంటాడు.

అందుకు ఉదాహరణ తాజాగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మళయాళ మాతృకని తెలుగు నేటివిటీకి అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సాగర్ కె చంద్ర.
pawan kalyan : పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి త్రివిక్రమ్ ప్రధాన కారణం అని అంటున్నారు.
ఇక ఈ సినిమాకి తెలుగులో త్రివిక్రమ్ మాటలు రాస్తుండటం తో పాటు స్క్రీన్‌ప్లే ని కూడా అందిస్తున్నాడు. అంతేకాదు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి త్రివిక్రమ్ ప్రధాన కారణం అని అంటున్నారు. అందుకే ఎలాగైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమా విషయంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సినిమా మేజర్ వర్క్ అయ్యే వరకు మరో సినిమా గురించి కూడా ఆలోచించడం లేదని చెప్పుకుంటున్నారు.