Adipurush : ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి గెటప్ ఇదే..?

Adipurush : ఆదిపురుష్ .. ప్రభాస్ రాముడి గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 5 భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ప్రభాస్ ప్రస్తుతం 4 భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

this-is-prabhas-ram-role-in-adipurush
this-is-prabhas-ram-role-in-adipurush

ప్రభాస్ మేకోవర్ పరంగా ఒక్కో సినిమాకి ఒక్కో రకమైన గెటప్ లో కనిపించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ లో చాలా క్లాస్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాలో లుక్ కి కంప్లీట్ డిఫ్రెంట్ గా సలార్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే సలార్ ఒక షెడ్యూల్ కూడా పూర్తి కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Adipurush : ఆదిపురుష్ లో రాముడిగా ఎలా ఉంటాడన్నదే ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ…!

ఇలా ‘రాధేశ్యామ్’, సలార్ సినిమాలలో ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే అందరు చూసేశారు. కాని ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ఎలా ఉంటాడన్నదే ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ. అందుకు తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ లుక్ ఎగ్జాంపుల్ అని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ లుక్ ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది ఆదిపురుష్ లో రాముడి గెటప్ అని అందరూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Advertisement