Pan India Star Hero : ఈ ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు గ్లోబల్ స్టార్.. గుర్తు పట్టారా..!
NQ Staff - June 19, 2023 / 01:16 PM IST

Pan India Star Hero: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చాలా విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే సెలబ్రిటీలకు ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ నడుమ వారి చిన్నప్పటి ఫొటోలను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. వాటిని గుర్తు పట్టాలంటూ ఛాలెంజ్ విరుసుతున్నారు.
కొందరు ఈ ఫొటోలను ఈజీగా గుర్తు పడుతున్నారు. కానీ కొందరిని మాత్రం గుర్తుపట్టలేక పోతున్నారు. ఇక తాజాగా మనకు పైన ఒక ఫొటో కనిపిస్తోంది కదా. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో తన తండ్రితో ఉన్న ఓ కుర్రాడు కనిపిస్తున్నాడు. ఆయన మామూలోడు కాదండోయ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.
మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ కూడా ఆయనే. ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది. ఆయనే మన డార్లింగ్ ప్రభాస్. ఆయన తండ్రితో ప్రభాస్ దిగిన ఫొటోను నిన్న ఫాదర్స్ డే సందర్భంగా కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దాంతో ఆ ఫొటో వైరల్ అవుతోంది.

This Child Became Pan India Star Hero
ఇందులో ప్రభాస్ చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇక రీసెంట్ గానే ఆయన ఆదిపురుష్ సినిమాతో వచ్చాడు. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఆయన సలార్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీపైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.