ప్రేక్షకులకి భారీ సర్‌ప్రైజ్… 2021 సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలివే..

Vedha - October 25, 2020 / 12:57 PM IST

ప్రేక్షకులకి భారీ సర్‌ప్రైజ్… 2021 సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలివే..

మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్రాక్. ఈ సినిమా రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. దాంతో క్రాక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రవితేజ – శృతిహాసన్ ల పోస్టర్ అదిరిపోయింది. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కి ఈసారి బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు.

Image

ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా క్రాక్ రూపొందుతుండగా రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ .. సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ వరసగా సినిమాలని లైన్ లో పెట్టుకున్నాడు.

Image

ఇక అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ సమరణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర యూనిట్ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి రొమాంటిక్ టీజర్ ని రిలీజ్ చేశారు. యూత్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్, ప్రేక్షకులని ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సారి అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో భారీ హిట్ దక్కించుకోవడం పక్కా అని భావిస్తున్నారు.

ఈ దసరా పండగా సందర్భంగా ఈ రెండు సినిమాలతో పాటుగా రామ్ పోతినేని నటించిన ” రెడ్ ” సినిమా నుంచి అదిరిపోయో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ పోషిస్తున్న రెండు విభిన్నమైన పాత్రలకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ మాస్ ఆడియన్స్ తో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయినా ఈ సినిమాని ఓటీటీ లో మాత్రం రిలీజ్ చేసే సమస్యే లేదని క్లారిటీ ఇస్తూ మేకర్స్ పోస్టర్ లో 2021 సంక్రాంతికి రిలీజ్ అని వెల్లడించారు.

Image

రామ్ కి జంటగా నివేతా పెతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. యంగ్ బ్యూటి హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో రామ్ తో స్టెప్పులేదింది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు…మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మొత్తానికి కరోనా కారణంగా ఇన్నాళ్ళు థియోటర్ లో సినిమాల సందడి లేక ప్రేక్షకులు ఎంతగానో విసిగిపోయారు. ఓటీటీ అందుబాటులో ఉన్నా సినిమాని థియోటర్ లో చూసిన ఫీలింగ్ ఓటీటీలో ఉండదు. అందుకు తగ్గట్టుగానే ఈ సంక్రాంతి సందడి ఊహించని రీతిలో ఉండబోతుంది. వరసగా టాలీవుడ్ స్టార్స్ అందరు తమ సినిమాలని పెద్ద పండగ సీజన్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా వచ్చిన అప్‌డేట్స్ తో రవితేజ క్రాక్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రామ్ రెడ్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు అధికారకంగా వెల్లడైంది. ఇంకా ఎన్ని సినిమాలు 2021 సంక్రాంతికి బరిలో దిగనున్నాయో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us