Allari Naresh : అల్ల‌రి న‌రేష్ ఉగ్ర రూపం.. స‌రికొత్త లుక్‌లో స‌ర్‌ప్రైజ్ చేసిన అల్ల‌రోడు

NQ Staff - August 22, 2022 / 11:03 AM IST

Allari Naresh : అల్ల‌రి న‌రేష్ ఉగ్ర రూపం.. స‌రికొత్త లుక్‌లో స‌ర్‌ప్రైజ్ చేసిన అల్ల‌రోడు

Allari Naresh : వైవిధ్య‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న హీరో అల్ల‌రి నరేష్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్‌లో కామెడీ చిత్రాల‌తో అల‌రిస్తూ వ‌చ్చాడు. మ‌ధ్య‌లో వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో పంథా మార్చి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘నాంది’ ఓ డిఫరెంట్ కథతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ఓ సీరియస్ కథతో తెరకెక్కుతోంది.

న‌రేష్ విశ్వ‌రూపం..

ఈ సినిమాను దర్శకుడు ఏఆర్ మోహన్ సీరియస్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో గిరిజన జాతిలో పుట్టిపెరిగిన వారి జీవితాలను నరేష్ ఏ విధంగా మార్చాడనేది మనకు సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌లో చూపించారు. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి, వీలైనంత త్వరగా వాటిని కూడా ముగించాలని చూస్తోంది.

There Update Regarding Allari Naresh Ugram Movie

There Update Regarding Allari Naresh Ugram Movie

తాజాగా అల్ల‌రి న‌రేష్ మ‌రో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. అల్లరి నరేష్ -విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన నాంది చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ఈ కాంబినేషన్ లో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఉగ్రం అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ రక్తపు మరకలతో షాకింగ్ లుక్ లో కనిపించాడు.

పైగా వీపు వెనుక గుచ్చుకున్న కత్తితో నిజంగానే ఉగ్ర రూపంలో నరేష్ లుక్ ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే.. ఈ చిత్రం పూర్తి వైల్డ్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. గతంలో కూడా ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ నాంది లాంటి చిత్రాలతో మెప్పించిన నరేష్.. ఇప్పుడు ఈ ఉగ్రం తో కూడా మరోసారి ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇక ఈ ఉగ్రం చిత్రంలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉన్నాయి

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us