Unstoppable Season 2: అన్ స్టాపబుల్ షో ఎక్కడ? ఆహా పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్
NQ Staff - January 25, 2023 / 07:46 PM IST

Unstoppable Season 2 : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 లో కంటిన్యూ గా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేయక పోవడం పట్ల ఫ్యాన్స్ ఆహా టీమ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ పేరు చెప్పి రెండు వారాల పాటు ఎలాంటి ఎపిసోడ్స్ లేకుండా ఎగువేసిన ఆహా టీమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పేరుతో కొత్త ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయడం లేదు.
అన్ స్టాపబుల్ షో లో ఎపిసోడ్స్ ఈ సారి కంటిన్యూ గా రాకపోవడం పట్ల ఆహా వారి అలసత్వం కారణమా లేదంటే బాలకృష్ణ బిజీ షెడ్యూల్ కారణమా అనేది తెలియడం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా విడుదల నేపథ్యంలో మొన్న బాలయ్య తో పాటు యూనిట్ సభ్యులు షో లో సందడి చేశారు.
ఆ తర్వాత వారంలో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు రాబోయే రెండు వారాల వరకు కూడా సీజన్ 2 కొత్త ఎపిసోడ్ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇక చివరిగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.
సీజన్ 2 మొదటి వారం నుండి మొదలుకుని బ్రేక్స్ ఇస్తూనే వచ్చారు. వచ్చే సీజన్ అయినా కంటిన్యూ గా ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.