Theatres: గుడ్ న్యూస్.. వంద శాతం ఆక్యుపెన్సీతో న‌డ‌వ‌నున్న థియేట‌ర్స్

Theatres: క‌రోనా ఎఫెక్ట్ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఎంత‌గా ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే షూటింగ్స్ అన్నీ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా, థియేట‌ర్స్ మాత్రం కొన్నిచోట్ల ఇంకా తెర‌వ‌లేదు. కొన్ని థియేట‌ర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు న‌డుస్తున్నాయి.

Theatres Run with 100 percent Occupancy in Andhra Pradesh
Theatres Run with 100 percent Occupancy in Andhra Pradesh

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా నిబంధనలతో సినిమా హాల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మరియు ఫంక్షన్ హాల్స్ ను తెరవడానికి అనుమతి ఇచ్చింది. థియేటర్ల నిర్వహణపై ఇంకా సందిగ్ధ‌త కొన‌సాగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనప్పటికీ రెండు రాష్ట్రాలలోనూ ఒకే సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ థియేటర్లు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఓకే చెప్పినా , ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో న‌డుస్తున్నాయి. క‌ర్ఫ్యూ వ‌ల‌న నాలుగు షోస్ న‌డుస్తున్నాయి. దీనిపై చ‌ర్చ‌లు కొద్ది రోజులుగా న‌డుస్తున్నాయి.

అయితే ప‌లు కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ 14 నుండి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డ‌పొచ్చ‌నే ప్ర‌క‌ట‌న చేయాల‌ని భావిస్తుంద‌ట‌. రేపు దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించిన త‌ర్వాత ఇలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.