Theaters : తెలుగు రాష్ట్రాల్లో నేడు మార్నింగ్ షో లు లేవు

NQ Staff - November 16, 2022 / 09:46 AM IST

Theaters : తెలుగు రాష్ట్రాల్లో నేడు మార్నింగ్ షో లు లేవు

Theaters : సూపర్ స్టార్‌ కృష్ణ మృతి తెలుగు సినిమా లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా కు ఎన్నో హంగులు ఆర్భాటాలు అద్దిన గొప్ప శాస్త్రవేత్త కృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి తెలుగు ఈస్ట్‌మన్ కలర్ మూవీని.. స్కోప్ సినిమాను.. 70ఎంఎం సినిమాను తెలుగు వారికి పరిచయం చేసింది కృష్ణ అనే విషయం తెల్సిందే.

అలాంటి గొప్ప స్టార్ మృతి తో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు నివ్వెర పోయాయి. ఈ సమయంలో ఆయనకు నివాళ్లు అర్పించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ బంద్ ప్రకటించింది. నేడు కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ ల్లో షో లు వేయడం లేదని ప్రకటించారు.

నేడు ఒక షో పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా ఎగ్జిబ్యూటర్స్ ప్రకటించారు. ఉదయం షో లు రద్దు చేసినా మ్యాట్నీ షో నుండి మళ్లీ థియేటర్ల వద్ద జనాలు ఉండబోతున్నారు. కృష్ణ కు నివాళ్లు అర్పించే ఉద్దేశ్యంతో థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల మరియు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియల నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు మరియు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us