Katrina Kaif: క‌త్రినా కైఫ్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Katrina Kaif: పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా కైఫ్ హిందీ ప్రేక్ష‌కుల‌నేక కాక తెలుగు ప్రేక్ష‌కుల‌ని సైతం ఎంతో అల‌రించింది. ‘బూమ్‌’ సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించిన కత్రినా కైఫ్ తొలి చిత్రంలోనే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్‌ కొట్టేసింది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకుంది.

అంద‌రిలానే క‌త్రినాకు కూడా టాలీవుడ్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. ‘అల్లరి పిడుగు’ చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌ ‘చిక్నీ చమేలీ’, ‘షీలాకీ జవానీ’ అంటూ ఐటం సాంగ్స్‌తోనూ అదరగొట్టింది.బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కత్రినా కైఫ్ ఈ రోజు ఆమె 38 వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

కత్రినా 16 జూలై 1983 న హాంకాంగ్‌లో జన్మించింది. బాలీవుడ్‌లో విజయపరంపర కొనసాగిస్తోన్న క‌త్రినా ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ రోజులలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సల్మాన్ నుంచి మొదలు కొని అక్షయ్ వరకు అందరితో జోడి కట్టింది. ప్రస్తుతం విక్కీ కౌషల్‌తో సినిమా చేస్తుంది. సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

బాలీవుడ్ క‌థ‌నాల ప్ర‌కారం క‌త్రినా ఒక్క సినిమాకుగాను ప‌ది కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకుంటుంద‌ట‌. ఇక ప్ర‌క‌ట‌న‌లు, తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ఇవేకాక ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ‘రీబూక్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమె రీబూక్‌ నుంచి కూడా బాగానే వసూలు చేస్తోందట. బాగ‌నే కూడ‌గ‌ట్టిన క‌త్రినా ముంబైలో ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌తో విలాస‌వంత‌మైన ఇల్లు కూడా కొనుగోలు చేసింది .

లండ‌న్‌లోను క‌త్రినాకు ఆస్తులు బాగానే ఉన్నాయ‌ట‌. ఏడు కోట్లు విలువ‌చేసే బంగ్లా, కోట్లు విలువ చేసి భూమితో పాటు ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి .క‌త్రినా మొత్తం చూస్తే 150 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఉంటుంద‌ని స‌మాచారం.