Samantha: మ‌హా స‌ముద్రం చిత్రాన్ని స‌మంత రిజెక్ట్ చేయ‌డానికి కార‌ణం బొమ్మ‌రిల్లు హీరోనా?

Samantha: నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌కి సంబంధించి ఎన్ని వార్త‌లు వ‌స్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేస్తున్నా.. విడాకుల గురించి ఎంత మంది నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా తను తీసుకున్న డెసిషన్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తోంది సమంత.

నాగచైతన్యే జీవితం అనుకుని, పిల్లలు కని సంతోషంగా ఉండాలనుకుని, అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా త్యాగాలు కూడా చేసింది స‌మంత‌. అయితే కొన్ని పరిస్థితుల‌వ‌ల‌న వారిద్ద‌రు విడిపోయి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే స‌మంత‌కు మ‌హా స‌ముద్రం సినిమాలో న‌టించే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. కాని దానిని సున్నితంగా తిరస్క‌రించిన‌ట్టు తెలుస్తుంది.

కథ, పాత్ర నచ్చినప్పటికీ సమంత మహాసముద్రం సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమాలో సిద్దార్థ్ ఒక హీరోగా నటిస్తూ ఉండటం వల్ల కూడా సమంత ఈ సినిమాకు నో చెప్పి ఉండవచ్చని తెలుస్తోంది. శర్వానంద్, సమంత కాంబినేషన్ లో జాను సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జాను సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాబట్టలేదు. అంతేకాదు.. శర్వానంద్, సమంత జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి .

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న సినిమా మహాసముద్రం. ఈ సినిమాని దసరా కానుకగా ఈ నెల 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావ్ హైదరీ కథానాయకులుగా నటించారు. ఈ మూవీలో నటించిన హీరోలు, హీరోయిన్లు వరుస ఫ్లాపుల్లో ఉండటంతో ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడిస్తున్నారు.