the price of Kiara Adwani hand bag : కియారా చేతిలో ఉన్న ఈ బ్యాగ్ ధర ఎంతో తెలుసా.. అన్ని లక్షలా..?
NQ Staff - July 21, 2023 / 01:27 PM IST

the price of Kiara Adwani hand bag : మామూలుగానే సెలబ్రిటీలు చాలా ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. అందులోనూ హీరోయిన్లు ఇలాంటి లగ్జరీ ఐటమ్స్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మామూలుగా వారు పెట్టుకునే వాచ్ లు కూడా కోట్లలోనే ఉంటాయి. ఆ రేంజ్ లో ఉంటాయి వారి లగ్జరీ లైఫ్ స్టైల్ అలావట్లు. ఇప్పుడు కియారా గురించి ఇలాంటి న్యూస్ వైరల్ అవుతోంది.
ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే ఆమె తాను ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించిపెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ వెకేషన్లకు వెళ్తున్నారు.
ముంబై ఎయిర్ పోర్టులో..
తాజాగా ఈ కొత్త జంట ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం అయింది. ఇందులో స్టైలిష్ లుక్ లో కనిపించారు ఇద్దరు. ఇందులో కియారా సింపుల్ గానే వచ్చింది. కానీ ఓ ఖరీదైన బ్యాగును వేసుకుని వచ్చింది. దాని ఖరీదు రూ.4లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.
ఎంతైనా కియారా చాలా లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. వీరిద్దరూ మాల్దీవులకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.