The Life of Muthu Movie Review : ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ రివ్యూ : రెగ్యులర్ గ్యాంగ్‌ స్టర్ డ్రామా

NQ Staff - September 18, 2022 / 08:02 AM IST

159304The Life of Muthu Movie Review : ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ రివ్యూ : రెగ్యులర్ గ్యాంగ్‌ స్టర్ డ్రామా

The Life of Muthu Movie Review : తమిళ స్టార్‌ హీరో శింబు కి తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది. ఆయన గతంలో నటించిన పలు సినిమాలు తెలుగు లో విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ ఈ మధ్య మాత్రం ఆయన ఇక్కడ సక్సెస్ ను దక్కించుకోలేక పోతున్నాడు. ఇక గౌతమ్ వాసు దేవ్ మీనన్ కి తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి దర్శకుడి దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

The Life of Muthu Movie Review

The Life of Muthu Movie Review

కథ :
సొంత ఊర్లో చాలా కష్టపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండే ముత్తు(శింబు) తన తల్లికోసం అన్నట్లుగా ముంబై కి వెళ్తాడు. అక్కడ ఒక పరోటా షాప్ లో పనికి కుదురుతాడు. అక్కడ పరోటాతో పాటు షాప్ యజమాని చెప్పినప్పుడు హత్యలు కూడా చేయాల్సి ఉంటుందని ముత్తుకు తర్వాత తెలుస్తుంది. ఆ రొంపి నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే షాప్ పై ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ గ్రూప్ దాడికి దిగుతుంది. అప్పుడు ముత్తు పరోటా షాప్ యజమానితో పాటు అందరిని కాపాడుతాడు. అలా డాన్‌ కి దగ్గర అయ్యి డాన్ యొక్క బాడీ గార్డ్‌ గా మారుతాడు. ఆ తర్వాత పరిణామాలు ఏంటీ? ముత్తు లైఫ్ లో ఏం జరిగింది అనేది ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు సినిమా ను చూసి తెలుసుకోండి.

The Life of Muthu Movie Review

The Life of Muthu Movie Review

నటీనటుల నటన :
శింబు ఈ సినిమాలో ఫిజికల్‌ గా కాస్త ఎక్కువగా కష్టపడ్డాడు. సినిమాలోని ఒకే పాత్ర కోసం రకరకాల వేరియేషన్స్ లుక్‌ తో కనిపించాడు. విభిన్నమైన నటన మరియు విభిన్నమైన మేనరిజంతో ముత్తు పాత్రకు శింబు పూర్తి న్యాయం చేశాడు అనడంలో సందేహం లేదు. ఫిజిక్ విషయంలో పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో శింబు ని కొత్త యాంగిల్ లో చూడవచ్చు. గతంలో వచ్చిన సినిమాకు ఈ సినిమాలోని శింబుకు చాలా వ్యత్యాసం ఉంది.

సమీరా రెడ్డి మంచి నటనతో తన పాత్రకు న్యాయం చేసింది. ఇక రాధికతో పాటు డాన్‌ పాత్రల్లో కనిపించిన వారు ఇతర సహాన నటీ నటులు అంతా కూడా పాత్రల మేరకు నటించారు. వారితో గౌతమ్ మీనన్ తనకు కావాల్సిన నటనను పిండుకున్నట్లుగా అనిపించింది. మొత్తంగా నటీ నటులు అంతా నాచురల్‌ గా చేసి ఆకట్టుకున్నారు.

The Life of Muthu Movie Review

The Life of Muthu Movie Review

టెక్నికల్‌ :
సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అనగానే ప్రేక్షకులు ఒకింత ఆసక్తిని కనబర్చడం చాలా కామన్ విషయం. పాటల విషయం పక్కన పెడితే గౌతమ్‌ వాసు దేవ్ మీనన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను రహమాన్ నుండి పొందడంలో సఫలం అయ్యాడనే చెప్పాలి. కథకు తగ్గట్లుగా ఒక చక్కటి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ తో రహమాన్‌ మెప్పించాడు. సినిమాటోగ్రపీ బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎలివేషన్‌ సన్నివేశాల్లో చాలా నాచురల్ గా ఉంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త బెటర్ గా ఆలోచించాల్సి ఉంది. దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్ మీనన్ ఒక సింపుల్‌ గ్యాంగ్ స్టర్ కథను తీసుకున్నా దాన్ని విభిన్నంగా స్క్రీన్‌ ప్లే చేశాడు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
శింబు నటన
ఏఆర్ రహమాన్ సంగీతం
గౌతమ్ మీనన్ దర్శకత్వం

మైనస్ పాయింట్స్‌ :
తమిళ ఫ్లేవర్ ఎక్కువ అయ్యింది
చాలా సినిమాల్లో చూసినటువంటి గ్యాంగస్టర్ సన్నివేశాలు
కథలో పట్టు లేక పోవడం

విశ్లేషణ :
ఇలాంటి కథలు రజినీకాంత్‌ బాష నుండి మొదలుకుని ఎన్నో సినిమాల్లో చూశాం. ఇప్పటికి కూడా ఈ కథలను ప్రేక్షకుల యొక్క అభిరుచికి తగ్గట్లుగా చూపించే అవకాశం ఉంది. కొత్తదనంను అద్ది కథను విభిన్నంగా ప్లాన్‌ చేయవచ్చు. దర్శకుడు గౌతమ్‌ మీనన్ అదే ప్రయత్నించాడు. ఆ విషయంలో కొన్ని సన్నివేశాల్లో సక్సెస్ అయినట్లుగా అనిపించినా కూడా ఓవరాల్‌ గా మాత్రం పర్వాలేదు అనిపించాడు. ఇలాంటి గ్యాంగ్‌ స్టర్ రొటీన్ డ్రామా సినిమాలు కొందరిని మాత్రమే నచ్చుతాయి.

రేటింగ్‌ : 2.5/5.0