Samantha: స‌మంత ఫ్యాన్స్‌కు షాక్.. ఏం జ‌రిగిందంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత తొలిసారి ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విల‌న్ పాత్ర పోషిస్తుంద‌ని తెలుస్తుండ‌గా, ఇటీవ‌ల చిన్న టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌మంతని హైలైట్ చేస్తూ టీజ‌ర్ ఉండ‌డంతో అభిమానులు ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచ‌నాలే పెంచుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో మేక‌ర్స్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాన‌ని చెప్పి, అది రిలీజ్ చేయ‌లేదు. ఇక ఫిబ్ర‌వ‌రి 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల అవుతుంద‌ని చెప్పి, ఆ డేట్‌ను కాస్త ముందుకు తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

గ‌త ఏడాది జాను అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ఆ త‌ర్వాత వెండితెర‌పై మెరిసింది లేదు. బిగ్ బాస్ షోలో హోస్ట్‌గా క‌నిపించి ఓ రోజు తెగ సంద‌డి చేసింది. హౌజ్‌మేట్స్‌తో నానా రచ్చ చేసింది. ఇక ఆ త‌ర్వాత ఆహా ఓటీటీ కోసం వ్యాఖ్యాతగా మారి ప‌లువురు సెల‌బ్రిటీల నుండి ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టింది. సామ్ జామ్ అనే కార్య‌క్ర‌మంతో సంద‌డి చేసిన స‌మంత ప్ర‌స్తుతం కొద్ది రోజులుగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ముంబైలోను ఈ వెబ్ సిరీస్ కోసం ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంది.

అయితే ఫిబ్ర‌వ‌రి 12న వ‌స్తుంద‌ని అనుకుంటున్న స‌మయంలో ది ఫ్యామిలీ మెన్ 2ను మ‌రి కొద్ది రోజులు వాయిదా వేస్తార‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డంతో అస‌లు ఏం జ‌రిగింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమెన్‌`ను రాజ్ ఎన్ డీకే ద్వ‌యం అత్యంత ప‌ర్‌ఫెక్ష‌న్‌తో రూపొందించారు. వెబ్ సిరీస్‌ల‌లో అత్యంత పాపుల‌ర్ సిరీస్‌గా ఇది నిల‌వ‌గా, సీమాంత‌ర తీవ్ర వాదం నేప‌థ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కి జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది.తాజాగా దీనికి సీక్వెల్‌గా వ‌స్తున్న‌`ది ఫ్యామిలీ మెన్ 2`లో మ‌నోజ్ బాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement