Chiranjeevi : చిరంజీవి మేనేజర్ తల్లి అదృశ్యం… ఫోన్ లో పరామర్శించిన మెగాస్టార్
NQ Staff - October 11, 2022 / 10:27 AM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటారు, ఆయన తన అభిమానులకు కష్టం వస్తే తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
చిరంజీవి పర్సనల్ మేనేజర్ గంగాధర్ తల్లి సత్యవతి ఇటీవల అదృశ్యం అయ్యారు. ఐ పోలవరం మండలం కోమరగిరిలో గంగాధర్ ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా సత్యవతి కనిపించక పోవడంతో ఇప్పటికే గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు మెగా అభిమానులు సత్యవతి కోసం వెతుకుతున్నారు. ఆమె త్వరలోనే తిరిగి ఇంటికి వస్తుందని అంతా ఆశ భావంతో ఉన్నారు.
ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి గంగాధర్ ను ఫోన్ ద్వారా పరామర్శించి తల్లి సత్యవతి గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో గంగాధర్ తో పాటు ఇతర మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్లో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.