Hyderabad : ప్రపంచంలోనే అతి పెద్ద వెండి తెర మన హైదరాబాద్‌లో…!

NQ Staff - November 22, 2022 / 10:30 AM IST

Hyderabad : ప్రపంచంలోనే అతి పెద్ద వెండి తెర మన హైదరాబాద్‌లో…!

Hyderabad : హైదరాబాద్ సినిమా ప్రేక్షకులకు మరో అద్భుతమైన కన్నుల విందు చేసే సినిమా ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది. 64 అడుగుల ఈ భారీ తెర దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది.

దీని వెడల్పు 101.6 అడుగులు. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇదే అతి పొడవైన స్క్రీన్ గా రికార్డు సాధించబోతోంది. హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు అతి త్వరలోనే ఈ అతి పెద్ద సిల్వర్ స్క్రీన్ అందుబాటులోకి రాబోతున్నట్లుగా ప్రసాద్ ఐమాక్స్ నిర్వాహకులు తెలియజేశారు.

ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతుందని, త్వరలోనే ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ యొక్క ప్రొజెక్టర్ ద్వారా ఈ వెండి తెరపై సినిమా ను ప్రొజెక్ట్ చేసేందుకు ఉపయోగించబోతున్నట్లుగా ప్రసాద్‌ ఐమాక్స్ వారు ప్రకటించారు.

మొత్తానికి ఈ స్క్రీన్ పై సినిమా చూడడం ఒక అద్భుతం అన్నట్లుగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఒక్కసారైనా ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. ఇక నుండి ఈ బాహుబలి తెరపై సినిమా చూడాలని అంతా కోరుకుంటారు అని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us