Dishapatani : దిశాపటానికి ఆ స్టార్ అన్నీ నేర్పాడట..!

Dishapatani : దిశాపటానీ..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. రిలీజ్ కి ముందు నుంచి భారీ అంచనాలున్న ఈ సినిమా రిలీజైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతే ఇక దిశాపటానీ మళ్ళీ తెలుగులో సినిమా చేసే అవకాశం దక్కించుకోలేకపోయింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తుండగా త్వరలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘రాధే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

that star has taught everything to dishapatani
that star has taught everything to dishapatani

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా దిశాపటానీ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ప్రతీ ఒక్కరు తమకి తాము నమ్మకంతో ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ ..సల్మాన్‌తో నటించిన ‘రాధే’ సినిమా థియేటర్స్‌లోనే చూసుకోవాలనుకున్నట్టు తెలిపింది. తను కోరుకున్నట్టుగానే ఈ సినిమా థియేటర్స్‌లోనూ.. అలాగే ఓటీటీలో మే 13న రిలీజ్ కాబోతోంది. ఇక ‘రాధే’ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ నుంచి ఎన్నో విషయాలను నెర్చుకున్నాని ఈ సందర్భంగా తెలిపింది.

Dishapatani : దిశాపటానీ .. అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని పొగడ్తలతో మోసేసింది.

ఈ సినిమాలో ఉన్న సీటీమార్‌ సాంగ్ తనకి ఎంతో ప్రత్యేకమైనది అని వెల్లడించింది. ఇక ఈ సాంగ్ నేడు సోమవారం రిలీజ్ అయింది. ఈ సాంగ్‌కి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇటీవల రిలీజైన లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక దిశాపటానీ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఏదీ రాలేదు. కాగా ఆమధ్య దిశాపటానీ .. అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని పొగడ్తలతో మోసేసింది.

Advertisement