Naga chaitanya: చైతూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన థ్యాంక్యూ మూవీ ఫ‌స్ట్ లుక్

Naga chaitanya: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ఇటీవ‌ల‌ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెర‌కెక్కిన లవ్ స్టోరీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. ‘థ్యాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

thank you movie first look of Naga chaitanya (1)
thank you movie first look of Naga chaitanya (1)

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ మధ్య ఇటలీ వెళ్లి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించుకుని వచ్చారు. ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు చైతన్య. థ్యాంక్యూ సినిమాలో చైతూకి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు.

గతంలో ప్రేమమ్ సినిమాలో మూడు గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు చైతూ. ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలో కూడా వయసు పరంగా చైతన్య మూడు దశలలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ రోజు చైతూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు చైతూ.

మనం(2014) తర్వాత దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌లో చైతూ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌లు హీరోయిన్లు. మైసూర్‌ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ సహా సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ , టీజ‌ర్ కూడా విడుదల చేసారు. తాజాగా విడుదలైన బంగార్రాజు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. పైగా నాగ చైతన్య పాత్ర కూడా బంగార్రాజుగా ఇంట్రడ్యూస్ చేయడంతో ఈ సినిమాలో యంగ్ ఏజ్ పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నట్టు కన్ఫామ్ అయింది.