Thank you brother : థ్యాంక్ యు బ్రదర్ కాపీ అంటూ కామెంట్స్..హిట్ దక్కనుందా..?

Thank you brother : థ్యాంక్ యు బ్రదర్ కాపీ అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ముఖ్య పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

thank-you-brother-is  a copy story
thank-you-brother-is a copy story

కానీ కోవిడ్ నేపథ్యంలో థియేటర్లు క్లోజ్ అవటంతో ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఓటీటీ ఆహా లో మే 7న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ – టీజర్ – ట్రైలర్ సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చేలా చేశాయి. దాంతో భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే అదే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే నైజీరియన్ సినిమాకి థ్యాంక్ యు బ్రదర్ కాపీ అనే కామెంట్స్ వస్తున్నాయి.

Thank you brother : ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమా కథ ఉంటుందంటూ ‘ఎలివేటర్ బేబీ’ సినిమా తరహాలో..?

నైజీరియన్ భాషలో రెండేళ్ల క్రితం వచ్చి హిట్ గా నిలిచిన ‘ఎలివేటర్ బేబీ’ సినిమా తరహాలో ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమా కథ ఉంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొద్ది మార్పులతో అదే కంటెంట్ ని సినిమాగా తీశారని అంటున్నారు. అయితే ఇది కాపీ నా? లేదా రైట్స్ తీసుకొని రీమేక్ చేసారా? అన్న విషయం మాత్రం మేకర్స్ స్పందిస్తే గానీ క్లారిటీ వస్తుంది. చూడాలి మరి నిజంగా ఈ సినిమా కాపీనా లేక ఇన్స్పిరేషన్‌తో తెరకెక్కించారా.

Advertisement