Pawan Kalyan : పవన్ రాజకీయాలపై తమ్మారెడ్డి సంచలన కామెంట్స్.. అలా చేస్తేనే సీఎం అవుతావంటూ..

NQ Staff - May 21, 2023 / 03:05 PM IST

Pawan Kalyan : పవన్ రాజకీయాలపై తమ్మారెడ్డి సంచలన కామెంట్స్.. అలా చేస్తేనే సీఎం అవుతావంటూ..

Pawan Kalyan : దర్శకుడిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఈయన ఎప్పటి కప్పుడు ట్రెండింగ్ లో ఉన్న విషయాల గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. ఇక ఈయన గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కామెంట్స్ చేసి ఫ్యాన్స్ చేత ట్రోల్స్ కు గురి అయ్యాడు. ఇక ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి..

పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేస్తూనే రాజకీయాల్లో కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూ యాక్టివ్ ఉంటున్నాడు.. మరి ఈయన రాజకీయాలపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శలు చేసారు.. పవన్ గారు తనకు ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పడం బాధించింది అని..

అలా చెప్పడం కరెక్ట్ కాదని.. ఎందుకంటే ఈయన గత ఎన్నికల సమయంలో గెలుపు కోసం ప్రయత్నించలేదని తెలిపారు. తనకు బలం ఉన్న నియోజక వర్గాల్లో కూడా ఈయన కనీస ప్రచారం కూడా చేయలేదని.. అలా చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ప్రజలపై నిందలు వేయడం ఏంటి అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

పవన్ గారు మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఈసారి తప్పకుండ సీఎం అవుతారని అనుకుంటున్నా అని ఆయన తెలిపారు.. మీ ఓట్ల శాతం ఎంత ఉందో నిజాయితీగా చెప్పిగలిగే మీరు పోరాటం కూడా అంతే దైర్యంగా చేయాలి.. అంతేకాని నాకు 40 సీట్లు వస్తే నేను కింగ్ మేకర్ అవుత అనే మాట పవన్ నోటి వెంట రాకూడదు అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us