Vakeel Saab: 37000 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తూ వ‌కీల్ సాబ్ సినిమా వీక్షించిన థ‌మ‌న్

Vakeel Saab: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. చివరకు సెకండ్ వేవ్ ఎక్కువ తీవ్రతరం అవ్వడంతో థియేటర్లు మూసేశారు. లేదంటే వకీల్ సాబ్ రచ్చ ఇంకా కొనసాగేది.

Thaman Watching Vakeel Saab Movie in Emirates Flight
Thaman Watching Vakeel Saab Movie in Emirates Flight

బుల్లితెరపై వకీల్ సాబ్ హ‌వా న‌డిచింది. ఓటీటీలోను ఈ మూవీ మాములు ర‌చ్చ చేయ‌లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలోరూపొందిన ‘వకీల్ సాబ్’ హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా ప్ర‌భంజ‌నం కొన‌సాగుతూనే ఉంది. తాజ‌గా ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ వీక్షించారు. ఫ్లైట్‌లో ప్ర‌యాణిస్తూ థ‌మ‌న్ సినిమా చూశారు. ఆ విషయాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. మ‌రోవైపు వకీల్ సాబ్ బీజీఎంని న‌వంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్న‌ట్టు పేర్కొన్నాడు థ‌మ‌న్.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం లో ఈ హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.