Artist Rajababu: సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. రాజ‌బాబు క‌న్నుమూత‌

Artist Rajababu: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజ‌బాబు (64) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1957 జూన్‌ 13న రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం.

TheNewsQube-
Telugu TV Artsit Rajababu is No More
Telugu TV Artsit Rajababu is No More

చిన్న‌ప్ప‌టి నుండే న‌టన‌పై ఆయ‌న‌కు ఆస‌క్తి ఎక్కువ‌. నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో వచ్చిన ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబును సినిమా రంగానికి పరిచయం అయ్యారు.రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలో నెట్టింది. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు.

మొత్తం 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. రాజబాబు సినీ రంగంతోపాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర వాటిల్లో నటించారు.

2005లో అమ్మ’ సీరియల్‌లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.