Director: ప్ర‌ముఖ సెల‌బ్రిటీతో ద‌ర్శ‌కుడు ల‌వ్ ఎఫైర్.. అసలు విష‌యం ఇది!

Director సినీ ప‌రిశ్ర‌మ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇందులో అడుగుపెట్టామంటే అన్నింటికి తెగించి రావ‌ల‌సి ఉంటుంది. చాలా మంది బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ వాట‌న్నింటిని ఓపిగ్గా భ‌రిస్తూ ప‌నిపైనే పూర్తి దృష్టి ఉండేలా ముందుకు సాగాలి. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలపై వ‌చ్చే రూమర్స్ అన్నీ ఇన్నీ కావు. సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి న‌చ్చినట్టు వారు క‌థ‌లు అల్లేస్తున్నారు. అయితే రూమ‌ర్స్‌పై కొంద‌రు సెల‌బ్రిటీలు స్పందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు లైట్ తీసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్యకు వేరే సెల‌బ్రిటీతో ల‌వ్ ఎఫైర్ ఉంద‌ని ఇండ‌స్ట్రీలో కొన్నాళ్లుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనిపై ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డంతో ఆ అనుమానం అంద‌రిలో అలానే ఉంది.

VN Aditya

కెరీర్ తొలి నాళ్ల‌లో మనసంతా నువ్వే, నేనున్నాను, బాస్, ఆట, తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యారు విఎన్ ఆదిత్య‌. కొంత‌కాలంగా మంచి సినిమా చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ, ఆదిత్య‌కు అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ద‌ర్శ‌కుడు త‌న‌పై వ‌చ్చిన రూమ‌ర్స్, సినీ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. అయితే ఎప్ప‌టినుండో అంద‌రిలో ఉన్న అనుమానంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో మీకు ఓ ప్రముఖ సెలబ్రెటీతో లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయని నిజమేనా అని యాంకర్ ప్ర‌శ్నించ‌గా, దీనికి స్పందించిన ఆదిత్య .. నాకు కూడా తెలియదు.ఆ సెలబ్రిటీ ఎవరో ఒకవేళ మీకు తెలిసి ఉంటే చెప్పండి.నాకు కూడా తెలుసుకోవాలని ఉందని చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చారు. మ‌నం ఎంత నిజాయితీగా ఉన్న‌ప్ప‌టికీ బుర‌ద‌జ‌ల్లేవాళ్లు చాలా మంది ఉంటారు. లవ్ ఫెయిల్యూర్, ఈగో వంటి వాటిని అంటగడుతూ మనుషులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు వి.ఎన్ ఆదిత్య 2011 సంవత్సరంలో “ముగ్గురు” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత “వాళ్ళిద్దరి మధ్య” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వ‌రుస డిజాస్ట‌ర్స్ వ‌ల‌న ఆదిత్య కెరీర్ అయోమ‌యంగా మారింది.