Faima : బిగ్ బాస్ లీక్ : జబర్దస్త్ లేడీ ఎలిమినేటెడ్
NQ Staff - December 4, 2022 / 07:35 AM IST

Faima : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల షో మాత్రమే మిగిలి ఉండగా ఈవారం ఫైమా ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా బిగ్ బాస్ టీం నుండి లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించబోతున్నాడు.
పటాస్ మరియు జబర్దస్త్ కార్యక్రమం తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఫైమా బిగ్ బాస్ లో తప్పకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని అంతా భావించారు. కానీ ఆమె నుండి ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ రాలేదు అంటూ చాలా మంది పెదవి విరిచారు.
చలాకి చంటి మరియు ఫైమా ఇద్దరూ కూడా జబర్దస్త్ కమెడియన్స్.. వీరిద్దరి ప్రజెంట్ తో బిగ్ బాస్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మారుతుంది అని అంతా భావించారు. కానీ ఫైమా ఎటకారపు మాటలు ఇతరులను అవహేళన చేయడానికి ఎక్కువ సమయం కేటాయించింది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆ విషయం పక్కన బెడితే నేటి ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ అవ్వబోతుంది. ఫైమా గత వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో పైమా ఎలిమినేట్ అవ్వలేదు. కానీ ఈ సారి మాత్రం ఆమె ఎలిమినేట్ అయ్యింది.
గతవారం అదృష్టం కొద్దీ సేవ్ అయిన ఫైమా ఈ వారం కూడా ప్రేక్షకులు ఓట్లు వేయకపోవడంతో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి తీరుతాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసింది కానీ టాప్ ఫైవ్ లో కూడా ఫైమా ఉండకుండా బయటకు వచ్చేసింది.