Sonu Sood: సోనూసూద్ సాయం కోసం ముంబైకు పాద‌యాత్ర చేప‌ట్టిన తెలంగాణ వాసి

Sonu Sood: సోనూసూద్ .. ఇప్పుడు ఈ పేరు జ‌నాల మ‌న‌సుల్లో దేవుడిగా కొలువు దీరింది. ఆయ‌న చేస్తున్న సాయాల‌కు ప్ర‌జ‌లు విగ్ర‌హాలు పెట్టి పూజ‌లు చేస్తున్నారు. కొంద‌రైతే వారి పిల్ల‌ల‌కు సోనూసూద్ పేరు పెట్టుకుండ‌గా, మరి కొంద‌రు వారి షాపుల‌కు సోనూ పేరుని పెడుతున్నారు. క‌ష్టాల‌లో నిలిచి ప్ర‌జ‌ల ఆక‌లి తీరుస్తున్న రియ‌ల్ హీరో సోనూసూద్ . కోవిడ్ కారణంగా బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, రెమ్‌డెసివర్ ఇంజిక్షన్లు తదితర వైద్య సదుపాయాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కాపాడాడు. గ‌త ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి.. తమ సొంత ఊళ్లకు వెళ్లలేక వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలు ఇబ్బందులు ఎదురుకున్నారు. వారంద‌రికి సోనూసూద్ అండ‌గా నిలిచారు.

Sonu Sood

ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా.. కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫ‌లం అవుతున్నాయి. సోనూసూద్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్ర‌జ‌ల ప్రాణాల‌ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎవ‌రు ఏ సాయం కోరినా వెంట‌నే స్పందిస్తున్నాడు. కేవలం ఒక్క రాష్ట్రం ఒక్క ప్రాంతం కాదు, దేశ వ్యాప్తంగా సోనూసూద్ సేవ‌లు అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతున్నాయి. సోనూకు చేయూత ఇచ్చేందుకు తన తోటి నటీనటులతో పాటు.. దేశ నలుమూలల నుంచి అభిమానులు ముందుకు వస్తున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్.. సోనూసూద్ ఫౌండేషన్‌కు భారీ విరాళం ఇచ్చింది.

Sonu Sood

క‌ష్టాల‌లో ఉన్న కొంద‌రు సోనూసూద్ సాయం కోసం ఎదురు చూస్తుండ‌గా, వారు ఆయ‌న‌ని ఎలా సంప్ర‌దించాలో తెలియ‌క నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని ప‌రిగి ప్రాంతానికి చెందిన వెంక‌టేష్ త‌న అభిమాన న‌టుడు సోనూసూద్‌ని క‌లిసేందుకు హైద‌రాబాద్ నుండి ముంబైకి పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరారు. పాద‌యాత్ర స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన వెంక‌టేష్ .. లాక్‌డౌన్ కార‌ణంగా నా తండ్రి కొనుకున్న ఆటో నెల‌వారీ ఈఎంఐ చెల్లించ‌లేకపోయాడు. దీని వ‌ల‌న ఫైనాన్స్ వారు నా తండ్రి ఆటోని స్వాధీనం చేసుకున్నారు. దీని వ‌ల‌న నా తండ్రి మాన‌సికంగా కుంగిపోయారు.ఏం చేసుకుంటాడో అనే భ‌యం క‌లుగుతుంది. చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోయాను. ఇప్పుడు తండ్రిని కోల్పోవాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే సోనూసూద్ సాయం కోసం పాద్ర‌యాత్ర‌గా బ‌య‌లు దేరాను అని వెంక‌టేష్ పేర్కొన్నారు. మ‌రి ఈ విష‌యం ముందుగానే సోనూసూద్‌కి చేరి ఆయ‌న స్పందిస్తాడా అన్న‌ది చూడాలి.