Nikhil: నిబంధనలు ఉల్లంఘించిన యంగ్ హీరో.. చలాన విధించిన పోలీసులు

Nikhil: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎనర్జీ యాక్టింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిఖిల్ ప్రస్తుతం 18 పేజీస్ అనే సినిమాతో పాటు కార్తికేయ 2 సినిమా చేస్తున్నారు. నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. అయితే రీసెంట్ గా నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా 18 పేజీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఓ విభిన్నమైన కథతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Nikhil Siddarth

నిఖిల్ గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే నిఖిల్, కలర్స్ స్వాతి కాంబినేషన్ లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కార్తికేయ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు గురించి ప్రస్తావన జరిగింది. ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.

Nikhil Siddarth

ఈరోజు నిఖిల్ సిద్ధార్థ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే సినీ విశేషాల గురించి కాకుండా ఆయనకు సంబంధించిన కారుకు పోలీసులు చలానా వేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే ఎవ్వర్ని వదలడం లేదు. ఈ క్రమంలో హీరో నిఖిల్ పేరు మీద రిజిస్టర్ అయిన ఓ కారుకు ఫైన్ వేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఫైన్ వేశారు. అయితే చలానా వేసిన టైమ్ లో నిఖిల్ సిద్ధార్థ్ ఆ కారులో లేరని పోలీసులు తెలిపారు.