Adipurush : ఆదిపురుష్ కి టీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి
NQ Staff - June 13, 2023 / 07:00 PM IST

Adipurush : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన ఆదిపురుష్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా అవ్వడంతో పాటు ప్రభాస్ నటించిన సినిమా అవ్వడం వల్ల బాలీవుడ్ సినిమా అయినా కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల పెంపుకు అనుమతులు ఇచ్చాయి.
ఏపీ లో రూ.50 రేట్లు పెంచేందుకు ఓకే చెప్పింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ సినిమా టికెట్ల రేట్ల ను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తెల్లవారు జామున 4 గంటల షో కి అనుమతి ఇచ్చింది.

Telangana Government Given Permission Increase Ticket Prices Of Adipurush
ప్రభాస్ గత చిత్రాలు సాహో మరియు రాధే శ్యామ్ నిరాశ పర్చినా కూడా ఈ సినిమాతో ప్రభాస్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా యొక్క బడ్జెట్ రూ.550 కోట్ల కాగా రెండు వేల కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.